ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం “ముఖ్యమంత్రి మార్పు” అంశం పెను సంచలనంగా మారింది. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో, ఏపీలోనూ అలాంటి మార్పులు సంభవించబోతున్నాయనే ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఉప ప్రధాని పదవిని చేపడతారని, ఆయన స్థానంలో ఉగాది తర్వాత నారా లోకేష్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారంటూ విపక్ష వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కొత్త చర్చకు తెరలేపాయి. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ ఈ “అధికార మార్పిడి” అంశం హాట్ టాపిక్‌గా మారింది.
Read Also : Hyderabad: రెండు రోజుల పాటు నీటి సరఫరా బంద్!
ఈ పరిణామాలపై వైసీపీ నేత తోట త్రిమూర్తులు స్పందిస్తూ కీలక డిమాండ్ ముందుకు తెచ్చారు. ఒకవేళ చంద్రబాబు జాతీయ రాజకీయాలకు వెళ్తే, పవన్ కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని, లోకేష్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని ఆయన సూచించారు. కాపు సామాజికవర్గానికి సీఎం పదవి దక్కాలనేది దశాబ్దాల కోరిక అని, పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాలకు ఇది సరైన గౌరవమని ఆయన అభిప్రాయపడ్డారు. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేస్తే కాపులు అంగీకరించే ప్రసక్తే లేదని హెచ్చరించడం ద్వారా కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం ప్రకారం, తన కుమారుడు లోకేష్‌తో కలిసి పనిచేయాలని చంద్రబాబు ఇప్పటికే పవన్‌ను కోరారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు పూర్తిగా ఖండిస్తున్నాయి. రాష్ట్ర అభివృద్ధిపై పూర్తి ఫోకస్ పెట్టిన చంద్రబాబును ఇబ్బంది పెట్టడానికే వైసీపీ ఇలాంటి “మైండ్ గేమ్” ఆడుతోందని వారు మండిపడుతున్నారు. ప్రస్తుతం కూటమిలో ఎలాంటి విభేదాలు లేకపోయినా, విపక్షాల ఈ కొత్త ప్రతిపాదనలు రాజకీయ సమీకరణాలను ఎటువైపు మళ్లిస్తాయో చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :