ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు సంబంధించిన కీలక కేసులో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పవన్ అభిమానులు కూడా హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ ధర్మాసనం పేర్కొంది. సోషల్ మీడియా వినియోగదారులు అభిమానుల ఖాతాల ద్వారా వాటిని పోస్టు చేస్తున్నారన్న వాదనను తిరస్కరించింది. కాగా పవన్ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించేలా ఉన్న కంటెంట్‌ను తొలగించాలని మెటా, గూగుల్, ఎక్స్ సంస్థలను ఢిల్లీ కోర్టు (Delhi High Court) ఆదేశించింది.
Read also: BC Reservation : గ్రామ రాజకీయాల్లో బీసీల దూకుడు!
కోర్టును ఆశ్రయించిన ప్రముఖులు
కొద్ది రోజుల క్రితం చిరంజీవి, నాగార్జున, తారక్ సహా పలువురు ప్రముఖులు ఇదే తరహాలో కోర్టును ఆశ్రయించారు. తమ పేరు, ఫొటోలు, వాయిస్ ను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టుకు ఫిర్యాదు చేసారు. దీంతో, ఇప్పుడు పవన్ (Pawan kalyan) పిటిషన్ విషయంలోనూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.. గత కొంతకాలంగా టాలీవుడ్ ను మొదలుకొని బాలీవుడ్ వరకు ఎంతోమంది సెలబ్రిటీలను,

సినీ ప్రముఖులను అలాగే రాజకీయ నాయకులను కూడా కొంతమంది టార్గెట్ చేస్తూ..ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలను దుర్వినియోగపరచడమే కాకుండా వీరి అనుమతి లేకుండానే.. వీరి ఫోటోలను ఉపయోగించడం.. బహిరంగంగా వీరి ఫోటోలను ఉపయోగించి ఫేక్ వస్తువులను మార్కెట్లో విక్రయించడం లాంటివి చేస్తూ.. సెలబ్రిటీల గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: