విజయవాడ Defence : దేశ రక్షణలో సైనికుల సేవలు (Military services) మరువలేమని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ అన్నారు. మాజీ సైనికోద్యోగులకు డ్రోన్ల వినియోగంతో మరోసారి దేశానికి, సమాజానికి సేవలు అందించే అవకాశం వచ్చిందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ తెలిపారు. మంగళవారం హోటల్ మినర్వాలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసారు. ఈ సందర్భంగా హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజీత్ మాట్లాడుతూ దేశానికి సేవలు అందించిన మాజీ సైనికోద్యోగులు డ్రోన్ల వినియోగంతో మరోసారి సమాజానికి సేవలు అందించే అవకాశం వచ్చిందన్నారు. దీని ద్వారా వాళ్లు ఉపాధి పొందుతూ కొద్దిమందికి స్వయం ఉపాధి అవకాశాలను కూడా కల్పించవచ్చాన్నారు. రాష్ట్రప్రభుత్వంలో సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్ ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందని, మాజీ సైనికోద్యోగులకు ఎంతో సేవలు అందిస్తుందన్నారు. అంతేకాకుండా వారికి ఇంకా ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనాఉందన్నారు.
వారికి ఎన్ని అవకాశాలు కల్పించినా తక్కువేనన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రమని రైతులు ఎరువులు, పురుగు మందుల వినియోగానికి డ్రోన్ల (Drones) ద్వారా స్ప్రే చేయడంతో తక్కువ సమయంలో పని పూర్తి చేయవచ్చన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :