దేశంలోనే అత్యధిక అప్పుల భారంతో ఏపీ, తెలంగాణ
కేంద్ర గణాంక సంస్థ నేషనల్ (DEBTS) శాంపిల్ సర్వే ఆఫీస్ (NSSO) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా అప్పుల భారం విషయంలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆంధ్రప్రదేశ్‌లో 43.7% మంది, తెలంగాణలో 37.2% మంది ప్రజలు అప్పులపై ఆధారపడి జీవిస్తున్నారని సర్వేలో తేలింది. 2020–21 గణాంకాల ప్రకారం, అప్పులపరంగా ఏపీ మొదటి స్థానంలో, తెలంగాణ (Telangana) రెండో స్థానంలో నిలిచాయి. మరోవైపు, బ్యాంకింగ్ సేవలు మరియు ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానమైన జనాభా శాతం (ఫైనాన్షియల్ ఇంక్లూజన్) విషయంలో కర్ణాటక (95.9%) మొదటి స్థానంలో ఉండగా, ఏపీ 92.3% శాతంతో రెండో స్థానంలో నిలిచింది. కానీ తెలంగాణలో ఈ శాతం కేవలం 86.5% మాత్రమే ఉండటంతో, దేశంలో 14వ స్థానంలో నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల సగటు చూస్తే, 92.1% మంది ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థలో భాగమై ఉండగా, వారిలో 31.8% మంది అప్పుల భారంతో బాధపడుతున్నారు. ఇక ఈశాన్య రాష్ట్రాల్లో 80.2% మంది మాత్రమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉండగా, 7.4% మందికే అప్పులున్నాయి.
Read also: ఆరోగ్య రహస్యం: ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండేందుకు ఉత్తమం

సామాజిక వర్గాలు, కుటుంబ పరిమాణం ఆధారంగా అప్పుల భారంలో తేడాలు
సర్వేలోని గణాంకాల (DEBTS) ప్రకారం, ఓబీసీ వర్గానికి చెందిన 16.6% మంది అప్పుల బారిన పడ్డారు. గిరిజన సమాజంలో ఈ శాతం 11% మాత్రమే ఉండటంతో కొంత తక్కువగా ఉంది. కుటుంబ పరిమాణం పరంగా కూడా ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి చిన్న కుటుంబాలపై అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉండగా, పెద్ద కుటుంబాల్లో ఆ భారం తక్కువగా ఉందని NSSO వివరించింది.
అలాగే, మతపరంగా చూస్తే హిందువులలో 88.1%, ముస్లింలలో 80.8% మంది ఫైనాన్షియల్ ఇంక్లూజన్ పరిధిలో ఉన్నారని గణాంకాలు వెల్లడించాయి. మొత్తంగా చూస్తే, ఆర్థికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానమై ఉన్నా, అప్పుల భారంతో గణనీయంగా సతమతమవుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: