చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : చిలకలూరిపేట(D.CM Pawan Kalyan) శారద జిల్లా పరిషత్ హై స్కూల్లో మెగా పేరెంట్స్ కమిటీ సమావేశంలో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజర య్యారు. విద్యావ్యవస్థలో కీలకమైన మార్పులను ప్రభుత్వం తెచ్చిందని, దానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టారన్నారు. దానిలో భాగంగానే శారద జిల్లా పరిషత్తు హై స్కూల్లో మెగా పేరెంట్స్ మరియు టీచర్స్ సమా వేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ మెగా పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో జరుగుతున్నాయని, వీటిలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు,(Chandrababu Naidu) శాఖ మంత్రి లోకేషు కూడా పాల్గొంటున్నారని ఈ సందర్భంగా వివరించారు. ఈ పేరెంట్స్ కమిటీ మీటింగ్లో ఉపాధ్యాయులు పిల్లలు ఎలా తీర్చిదిద్దుతున్నారనేది తెలుసుకోవడం జరుగుతుందన్నారు.
ఉపాధ్యాయులను గౌరవించటం విద్యార్థులు నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ విద్యార్థులకు తెలియజేశారు. వారు ఉన్నత స్థాయికి వెళతారని ఆయన అన్నారు. విద్యార్థులకు స్కిల్ ఓరియెంటెడ్ శిక్షణకూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు. శారదా ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు కావలసిన అన్ని విభాగాలలో శిక్షణ ఇస్తున్నారు అన్నారు. ఆడపిల్లలకు ఆత్మ రక్షణ కోసం కరాటే కూడా నేర్పించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా శారదా హైస్కూల్ విద్యార్థులు చేసిన కరాటే ప్రక్రియ తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు వీరికి శిక్షణ ఇచ్చిన గౌస్యాన్ను ప్రత్యేకంగా అభినందించారు చిలకలూరిపేట నియోజకవర్గ అభివృద్ధికి శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
Read also: రవికి పోలీసు శాఖలో ఉద్యోగం? క్లారిటీ ఇచ్చిన డిసిపి

పవన్ కళ్యాణ్ చిలకలూరిపేటలో అభివృద్ధి హామీలు
రాష్ట్ర పంచాయతీరాజ్(D.CM Pawan Kalyan) కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ చిలకలూరిపేట వాసి కావడం నాకు ఇప్పుడే తెలిసింది అన్నారు. వారి తాత మైలవరపు గుండయ్య కోట్లాది రూపాయలు చిలకలూరిపేట అభివృద్ధికి విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందన్నారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరినీ అభినందిస్తున్నానని అన్నారు. శారద జిల్లా పరిషత్ హై స్కూల్ కు కావలసిన లైబ్రరీ ఏర్పాటుకు తాను పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. అదేవిధంగా పాఠశాలకు 25 కంప్యూటర్లు కూడా తాను స్వయంగా అందజేస్తానని పవన్ కళ్యాణ్ సభలో ప్రకటించారు. హర్యానా రాష్ట్రం నుంచి జిల్లా కలెక్టర్ గా ఇక్కడికి విచ్చేసిన కృతిక శుక్ల తెలుగులో మాట్లాడటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
పేరెంట్స్ టీచర్స్ మేళాలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ రంజిత్ భార్గవ, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ మైలవరపు కృష్ణ తేజ, పల్నాడు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల, జిల్లా ఎస్పీ కృష్ణారావు ఆర్డీవో మధులత డి.ఎస్.పి హనుమంతరావు డిఇఓ చంద్రకళ ఐ ఎన్ పి ఆర్ డి డి దీప్తి, పట్టణ సిఐపి రమేష్ జనసేన ఉమ్మడి జిల్లా కన్వీనర్ గాది వెంకటేశ్వర్లు నియోజకవర్గం జనసేన నియోజకవర్గ యువ నాయకులు మండలనేని చరణ తేజ కూటమి నాయకులు మున్సిపల్ చైర్మన్ షేక్ రఫాని, చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి సత్యనా రాయణ సింగ్ విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, నియోజకవర్గ పరిధిలోని పోలీస్ రెవెన్యూ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత పట్టణంలో జనసేన యువ నాయకులు మండలిని చరణ్ తేజ ఆధ్వర్యంలో ఉపముఖ్యమంత్రి పవన్కు భారీ స్వాగత ఏర్పాటు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: