हिन्दी | Epaper

Davos: ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో చంద్రబాబు భేటీ

Tejaswini Y
Davos: ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో చంద్రబాబు భేటీ

దావోస్(Davos) వేదికగా జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (WEF) సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక భేటీ నిర్వహించారు. ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థ ఎన్‌విడియా (NVIDIA) గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ విభాగం ఉపాధ్యక్షురాలు కాలిస్టా రెడ్మెండ్తో సీఎం సమావేశమై రాష్ట్రంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో విస్తృత అవకాశాలపై చర్చించారు.

Read Also: FakeLiquor Case: బెయిల్ వచ్చినా జైలు బయటకు రాని జోగి రమేశ్

Davos: Chandrababu Naidu meets Nvidia Vice President
Davos: Chandrababu Naidu meets Nvidia Vice President

అమరావతిలో తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్

ఈ సందర్భంగా అమరావతిలో తొలి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ ఏర్పాటు అంశాన్ని చంద్రబాబు ఆమె ముందుంచారు. ఏఐ పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలకు అవసరమైన టాలెంట్‌ను తయారు చేసే దిశగా ఈ యూనివర్సిటీ కీలకంగా మారుతుందని సీఎం వివరించారు.

అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) ఏర్పాటు, హై ఎండ్ హార్డ్‌వేర్ తయారీ యూనిట్లు, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనలపై ఎన్‌విడియా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

ఏఐ, డీప్ టెక్, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రాన్ని ఏఐ, డీప్ టెక్, హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తెలిపారు. ఈ భాగస్వామ్యాల ద్వారా యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు, భారీ ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ భేటీతో ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పెట్టుబడులు, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

యుద్ధం.. ఇరాన్‌లో వారం రోజుల్లో 1,300 మంది మృతి

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం
0:10

గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి వర్షం: కువైట్, సౌదీలో విధ్వంసం

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

భారత్-కివీస్ టీ20 ఫైనల్.. పిచ్ రిపోర్ట్ ఇదే

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

అంతర్జాతీయ చమురు సంక్షోభం: ఉత్పత్తిని నిలిపివేసిన కువైట్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

KCR ఫొటో లేకుండానే రాజకీయాలు చేస్తానన్న కవిత

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన నారా లోకేశ్

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
1:02

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

అంతర్జాతీయ మహిళా దినోత్సవం : స్త్రీ శక్తికి పాదాభివందనం!

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి
0:33

తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న మీనాక్షి

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

విజయవాడ దుర్గమ్మ సన్నిధికి సీఎం చంద్రబాబు

📢 For Advertisement Booking: 98481 12870