స్టార్టప్లకు ప్రోత్సాహం, పారిశ్రామిక అనుసంధానం ముఖ్యం: డిసిఎం పవన్
విజయవాడ : గ్రామ స్థాయిలో(D.CM Pawan) సరికొత్త ఆవిష్కరణలకు గుర్తింపు, భద్రత, ప్రోత్సాహం అనే అంశాలపై దృష్టి సారించాలని అటవీ పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిత్వశాఖల నిర్వహకులు, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి, పవన్ కల్యాణ్ అధికారులకు స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలను గుర్తించి తక్షణం పేటెంట్ హక్కు కల్పించడంతోపాటు వారి ఎదుగుదలకు కావాల్సిన ప్రోత్సాహం అందించగలిగితే గ్రామ స్థాయి నుంచి కొత్త తరం ఆవిష్కర్తలను బయటకు తీసుకురావచ్చని తెలిపారు. ప్రధాన మంత్రి మోడీ(Modi) సంకల్పం మేడిన్ ఇండియా.. మేకిన్ ఇండియాలో మనవంతు భాగస్వామ్యం అయ్యేందుకు కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. అందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయా లని ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాల యంలో రాష్ట్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిం చారు. గడచిన ఏడాది కాలంలో రాష్ట్ర శాస్త్ర సాంకేతికశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలపై ఆరా తీశారు.
Read also: ‘వైకుంఠ’ ద్వార దర్శనాలకు తొలి మూడురోజులకు 1.76లక్షల టోకెన్లు

ఆవిష్కర్తలకు ప్రోత్సాహం – విజ్ఞానాభివృద్ధికి పునాదులు
రాజమండ్రిలోని(D.CM Pawan) స్వామి జ్ఞానంద ప్రాంతీయ సైన్స్ సెంటర్ కార్యకలాపాలపై సమీక్షించారు. నూతన ఆవిష్కర్తల అన్వేషణ, ప్రోత్సాహం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థకు నూతన ఆవిష్కరణలే ప్రాథమిక చోదక శక్తి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కొత్త ఆలోచనలను గుర్తించడం, ప్రోత్సాహం అందించడం, వాటిని సాకారం చేసు కుని మార్కెట్కి చేరేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం కీలకం. స్టార్టప్ లతో ముందుకు వచ్చే వారిని ప్రోత్సహించాలి. విశ్వ విద్యాలయం స్థాయి నుంచి పాఠశాల స్థాయి వరకు ఎంతో మంది సరికొత్త ఆవిష్కరణలతో తమ సామర్థ్యాన్ని చాటుకు న్నారు. అలాంటివారిని గుర్తించి బయటకు తీసుకురా వాలి. వారి ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు రక్షణ కల్పించడం ముఖ్యం. సరికొత్త ఆవిష్కరణలతో ముందుకు వచ్చే వారిని గుర్తించి వారిని విపణికి పరిచయం చేసే బాధ్యత ప్రభు త్వమే తీసుకోవాలి. అవసరం అయితే ఎంఎస్ఎంఇ పార్కుల్లో వీరికి ప్రాధాన్యత ఇచ్చే అంశంపై సిఎం చంద్రబాబు నాయుడుతో చర్చిస్తాం. మన అవసరాలకు తగిన విధంగా మనమే వస్తు వులు తయారు చేసుకోవాలి. 2047 నాటికి దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దేందుకు దోహద పడుతుంది అన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: