ఆస్తి పన్ను చెల్లించాలని కమిషనర్ పేరిట ఫేక్ కాల్స్ -స్కానర్ పంపి డబ్బు వసూలుకు ప్రయత్నం
Chittoor: చిత్తూరు మున్సి పల్ కార్పొరేషన్ పరిధిలో మరో కొత్త సైబర్ నేరం పురుడు పోసుకుంది. ఇప్పటికే సైబర్ నేరగాళ్ళు ప్రజలను ఎలాగోలా బుట్టలో వేసుకుని వారి నుండి డబ్బులు దోచుకుంటుండగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కమీషనర్ పేరిట ప్రజలకు ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించాలని సైబర్ నేరగాళ్ళు పరేషాన్లో పడేస్తున్నారు. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలు, ట్రేడ్ వర్తకులు ఆస్తి, ట్రేడ్ లైసెన్స్ పన్నులను చెల్లించాల్సి వుంటుంది. అయితే ఈ మధ్య నేరుగా ప్రజలు, ట్రేడ్ లైసెన్స్ దారులకు సైబర్ (Cyber Crime) నేరగాళ్ళు ఫోన్ చేసి ఎందుకు ఇంకా మీరు ఆస్తి, ట్రేడ్ లైసెన్స్ పన్ను చెల్లించలేదు. ఎప్పటికిప్పుడు చెల్లిస్తే మీకు అపరాధ రుసుం వుండదు. ఆలస్యం చేస్తే పెద్ద మొత్తంలో అపరాధ రుసుం చెల్లించాల్సి వుంటుందని ఫోన్ చేసి ఠారేత్తిస్తున్నారు. మీ ఫోన్కు ఒక స్కానర్ పంపుతున్నాము. ఆ స్కానర్ ద్వారా డబ్బులు చెల్లించాలని ట్రేడ్ లైసెన్స్ దారులు, ఆస్తి పన్ను చెల్లింపు దారులను బెదిరిస్తున్నారు.

మున్సిపల్ కమిషనర్ పేరిట ఫేక్ ఫోన్ కాల్స్
ఇలా అనునిత్యం ఆస్తి, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించాలని ఎవరెవరో ఫోన్ చేసి వాట్సాప్లో స్కానర్ ద్వారా పన్ను చెల్లించి ఆపరేటర్ను కలవాల్సిందిగా చెప్తుండటంతో కొంతమంది ఈ విషయంను మున్సిపల్ కమీషనర్ నరసింహప్రసాద్ దృష్టికి తీసుకెళ్ళారు. దీనిపై స్పందించిన మున్సిపల్ కమీషనర్ తాను పన్నులు చెల్లించాలని ఎందుకు ఫోన్ చేస్తానని, ఇదెదో సైబర్ నేరగాళ్ళ (Cyber Crime) పనులని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పన్ను చెల్లింపు దారులు అప్రమత్తంగా వుండాలి: కమీషనర్ నరసిహప్రసాద్ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆస్తి, ట్రేడ్ లైసెన్సు పన్నులు చెల్లించే వారు సైబర్ నేరగాళ్ళ పట్ల అప్రమత్తంగా వుండాలని మున్సి పల్ కమీషనర్ నరసింహప్రసాద్ అన్నారు. తన పేరుతో ఫేక్ ఫోన్ కాల్స్ చేసి కొంతమంది స్కానర్ ద్వారా డబ్బులు చెల్లించాలని మోసాలకు పాల్పడుతు న్నారన్నారు. పన్నులు చెల్లించాలని కమీషనర్ నేరుగా ఎవరికి ఫోన్ చేయరని, అలాగే స్కానర్కు డబ్బులు పంపమని చెప్పే అవకాశం లేదన్నారు. అయితే నగర పాలక సంస్థ పరిధిలోని పలువురు ఆస్తి, ట్రేడ్ లైసెన్స్ దారులకు సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి కమీషనర్ మాట్లాడుతున్నా! పన్నులు ఎందుకు చెల్లించలేదు! టాక్స్ కట్టాలని మీకు తెలియదా! స్కానర్లో డబ్బులు చెల్లించి ఆపరేటర్ ను కలవండి! అంటూ హడావుడి చేస్తూ స్కానర్ కోడ్ను వాట్సాప్ ద్వారా పంపుతు న్నారన్నారు. పలు రకాల నెంబర్ల నుండి ఈ ఫోన్ కాల్స్ వస్తున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు.
Read also: Triple IT: ట్రిపుల్ ఐటిల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 94.78% సీట్లు