విజయనగరం: ప్రేమగా, సంతోషంగా సాగుతున్న జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నాడని తెలిసి ఆ దంపతులు సంతోషంలో మునిగిపోయారు. సీమంతం పండుగను కూడా ఘనంగా జరుపుకున్నారు. అయితే, ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. ఒక మొక్కజొన్న(corn) కంకి ఆ దంపతుల జీవితాన్ని ఊహించని విషాదంలోకి నెట్టింది.
Read Also: President:తృటిలో ప్రమాదం నుంచి తప్పిచ్చుకున్న ద్రౌపదీ ముర్ము
రోడ్డుపై మొక్కజొన్న కంకి: బ్రెయిన్‌డెడ్‌కు దారితీసిన ప్రమాదం
విజయనగరం జిల్లా, గుర్ల మండలం, కొండగండ్రేడుకు చెందిన రేజేటి పాపినాయుడు (27) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. గతేడాది ఏప్రిల్‌లో అదే గ్రామానికి చెందిన మౌనికతో ఆయనకు వివాహమైంది. మౌనిక గర్భవతి కావడంతో అక్టోబరు 17న ఆమె ఇంట్లో సీమంతం వేడుక నిర్వహించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత పాపినాయుడు తన స్నేహితులను కలిసేందుకు అచ్యుతాపురం వెళ్లి, అక్కడి నుంచి బైక్‌పై తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. రాజుగారి కొబ్బరితోట వద్ద రోడ్డుపై రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న కంకులను గమనించక, బైక్ అదుపు తప్పి పడిపోయాడు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది.

తండ్రి మాదిరిగానే కొడుకు మృతి
ప్రమాదంతో తీవ్ర గాయాలైన పాపినాయుడును వెంటనే విజయనగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ డాక్టర్లు ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినట్లు ధ్రువీకరించారు. అనంతరం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
మరో విషాదకర విషయం ఏమిటంటే, 2012లో పాపినాయుడు తండ్రి అప్పలనాయుడు కూడా ఆటో బోల్తా పడిన ప్రమాదంలో బ్రెయిన్ డెడ్‌తోనే ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మాదిరిగానే కొడుకు కూడా మరణించడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతదేహాన్ని ఊరికి తీసుకురాగా, భార్య మౌనిక, కుటుంబ సభ్యులు గుండె పగిలేలా రోదించారు.
ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తి ఎవరు?
విజయనగరం జిల్లా, కొండగండ్రేడుకు చెందిన రేజేటి పాపినాయుడు (27).
ప్రమాదం ఎందుకు జరిగింది?
రోడ్డుపై రైతులు ఆరబెట్టిన మొక్కజొన్న కంకులను గమనించక బైక్ అదుపు తప్పి పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: