Crime ఆ తల్లికి ఎంత కష్టం వచ్చిందో తెలియదు. కొడుకును చంపి, ఆ ఆపై ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం జిల్లాలో (Anantapur district) ఈ విషాదం జరిగింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన గొడవల వల్ల మూడేళ్ల అభం శుభం తెలియని బిడ్డ ప్రాణాలు కోల్పోగా, తల్లి బలవన్మరణానికి పాల్పడింది. రామగిరి డిప్యూటీ తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న రవి తన భార్య అమూల్య, కొడుకు హర్షతో కలిసి అనంతపురంలోని శారదానగర్ లోని ఒక అపార్ట్మెంట్ లో నివసిస్తున్నారు.
Read Also: Shivakumar: DKకి ఆదిచుంచనగిరి మఠాధిపతి నిర్మలానందనాథ మద్దతు

రెండురోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం రవి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నారు. భార్యను ఎంత పిలిచినా ఆమె తలుపు తీయలేదు. ఆమె ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన రవి, అపార్టమెంట్ వాసులకు, పోలీసులకు సమాచారం అందించాడు.
కొడుకును చంపి, ఆపై ఉరేసుకుని ఆత్మహత్య
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా దారుణం జరిగింది. భార్య అమూల్య చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించగా, ఆమె పక్కనే మూడేళ్ల కుమారుడు సహర్ష రక్తపు మడుగులో పడి ఉన్నాడు. పోలీసుల విచారణలో ముందురోజు రవి, భార్యపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో కోపంతో క్షణికావేశంలో కత్తితో కొడుకు గొంతు కోసి హత్య చేసింది, ఆ తర్వాత అదే గదిలో చీరతో ఉరేసుకుంది. అదనపు కట్నం భార్యను రవి వేధించేవాడని అమూల్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: