తిరుపతి గ్రామీణంలోని తిరుచానూరు సమీప దామినేడు ఇందిరమ్మ గృహాల్లో సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి (Crime)గురి చేసింది. ఒక ఇంటి నుండి వస్తున్న దుర్వాసనను గుర్తించిన నివాసితులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న తిరుచానూరు సీఐ సునీల్‌కుమార్, ఎస్సై అరుణ తలుపులు తెరవగా, కుళ్లిన స్థితిలో మూడు మృతదేహాలు కనిపించాయి.
Read Also: Cyber crime: డిజిటల్ అరెస్ట్ తో 48 లక్షలు దోచుకున్న ముగ్గురు అరెస్ట్

వివాహేతర సంబంధం… కలిసి జీవనం
తమిళనాడులోని(Crime) గుడియాత్తం ప్రాంతానికి చెందిన సత్యరాజ్ (30) తన భార్యను విడిచి, పొన్నాగుట్టె నాయగి (పొంగొటై) (30)తో సంబంధం పెట్టుకొని మూడు నెలల క్రితం దామినేడు ఇందిరమ్మ ఇళ్లకు వచ్చి నివాసముంటున్నాడు. పొంగొటైతో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు మనీష్ కూడా సత్యరాజ్‌తో కలిసి అక్కడే ఉంటున్నారు. కూలి పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు.
అనుమానాస్పద మరణాలు
ఈ నెల 22వ తేదీ ఉదయం నుంచి ఈ ముగ్గురు బయట కనిపించకపోవడంతో అనుమానం మొదలైంది. ఇంటిని తెరిచి చూసిన పోలీసులు సత్యరాజ్‌ను ఉరితీయబడ్డ స్థితిలో, పొంగొటై మరియు చిన్నారి మనీష్‌ను వాష్‌రూమ్ దగ్గర మృతులుగా కనుగొన్నారు. వారి వద్దే విషం సీసా ఉండడం గమనించారు.
ముందుగా పొంగొటై, ఆమె కుమారుడు విషం సేవించి మృతిచెందిన తరువాత సత్యరాజ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? లేక సత్యరాజ్ వారిని హత్య చేసి తానే ఉరివేసుకున్నాడా? అనే రెండు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ ఘటనతో దామినేడు ఇందిరమ్మ కాలనీలో ఒక్కసారిగా కలకలం రేగింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: