Crime: డిపాజిటర్లకు రూ.143 కోట్ల మేర టోకరా విజయవాడ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అద్విక ట్రేడింగ్ మార్కెటింగ్ కంపెనీ ప్రజల నుండి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేసిన ఘటనలో ఫిర్యాది అయిన వీరమల్లు గణేష్ చంద్ర ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి సిపి రాజశేఖరబాబు ఆదేశాల మేరకు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. గణేష్చంద్ర తమ కుటుంబ సభ్యులు సదరు ట్రేడింగ్ కంపెనీ అధినేత తాడేపల్లి (Tadepalli) ఆదిత్యకు చెందిన కంపెనీలో రూ.53 లక్షలు డిపాజిట్ చేశారు. దానికి గాను రూ.13 లక్షలు ఇచ్చి కంపెనీ క్లోజ్ చేసి పారిపోయినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసు వివరాలు బయటకు రావడంతో సుమారు 1355 మంది మోసపోయినట్లు వెల్లడైంది.
Read also: Amaravati: నవంబరు 10 నుంచి జనగణన

Crime
దీంతో ఈ కేసును తీవ్రంగా పరిగణించిన సిపి రాజశేఖరబాబు ఆదేశాలతో క్రైం డిసిపి తిరుమలేశ్వరరెడ్డి, అథ్వర్యంలో సెంట్రల్ ఎసిపి దర్యాప్తులో టాస్క్ఫోర్స్ ఎసిపి లతకుమారి, వారి సిబ్బంది,10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగించారు. ప్రధాన నిందితుడైన ఆదిత్య, మిగిలిన నిందితుల బ్యాంక్ స్టేట్మెంట్లను, టెక్నికల్ సాక్షాలను సేకరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాల సమాచారం మేరకు సెంట్రల్ ఏసిపి దామోదరరావు వారి సిబ్బందితో కలిసి బల్లెం వారి వీధిలోని శ్రీ లక్ష్మిఎంక్లేవ్ అపార్ట్మెంట్ వద్ద నలుగురు నిందితులు, ఏజెంట్లైన తాడేపల్లి వెంకట ఆదిత్య, తాడేపల్లి అలియాస్ గంట సుజాత, గాదంశెట్టి బాలకృష్ణమూర్తి, (బృందావన్కాలని), గాదెంశెట్టి నాగలక్ష్మి(బృందావన్ కాలనీ అను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడైన ఆదిత్య అతని భార్య అయిన రెండవ నిందితురాలు సుజాత 2022లో అద్విక ట్రేడింగ్ కంపెనీ స్థాపించి రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టి, దుబాయిలో ఉన్న ‘కబానా అకౌంట్’ ద్వారా ట్రేడింగ్ ప్రారంభించారు.
మొదట్లో పెద్దగా లాభాలు రాకపోయిన డబ్బులు సంపాదించాలన్న ఆశతో అధిక లాభాల పేరుతో ప్రధాన నిందితుడైన ఆదిత్య, అతని భార్య సుజాత, ఏజెంట్లు అయిన బాలకృష్ణమూర్తి, నాగలక్షీ ఈ కుమారి, ఇతర ఏజెంట్ల సహాయంతో నెలకు 5% వడ్డీ ఏజెంట్లకు 3-4% మోసపూరిత హామినిచ్చి ప్రజలనుండి అధిక మొత్తంలో డిపాజిట్లు సేకరించారు. ట్రేడింగ్లో లాభాలు లేకపోయినా కొత్త డిపా జిటర్స్ కట్టిన డబ్బులతో పాత డిపాజిటర్కు వడ్డీ చెల్లించారు. 2023లో వార్షికోత్సవం నిర్వహించి మరిన్ని డిపాజిట్లు సేకరించారు. విచారణలో 2022 నుండి ఇప్పటి వరకు సుమారు 1450 మంది వద్ద నుండి సుమారు 400 కోట్లు డిపాజిట్లు సేకరించి దానిలో కొంత భాగాన్ని దుబాయిలో ఉన్న కబానా ట్రేడింగ్ మల్టీ బ్యాంకింగ్ ఫోరెక్స్ వంటి విదేశీ ప్లాట్ఫారంలకు బదిలీ చేసినట్లు వెల్లడైంది. ఆన్లైన్ ట్రేడింగ్లో సుమారు 14 కోట్లు లాస్ వచ్చినా కొత్తగా సేకరించిన డిపాజిట్నే పాత వారికి వడ్డీ కింద ఇచ్చారు.
డిపాజిట్లలో సుమారు 4కోట్లతో ఆదిత్య చరాస్తులు కొనుగోలు చేశాడు. డిపాజిట్స్ దారులకు వడ్డీ కట్టలేని స్థితికి వచ్చేసరికి పలాయనం చిత్తగించాడు. అద్విక ట్రేడింగ్ కంపెనీలో మూసివేసే సమయానికి సుమారు 1450 మంది డిపాజిటర్స్, 60 మంది ఏజెంట్లు ఉండగా వారిలో 1150 మంది డిపాజిటర్స్ నష్టపోయిన డబ్బులు సుమారు 135కోట్లు. సుమారు 25 ఏజెంట్లు నష్ట పోయింది 9 కోట్లు. మొత్తం 144 కోట్లు. ఈ కేసులో నిందితులకు సంబంధించి రూ.100 కోట్ల విలువైన చరాస్థులను పోలీసులు గుర్తించి, వారినుండి రూ.23 లక్షల నగదు, 580 గ్రాముల బంగారపు వస్తువులు, 8.3 కిలోల వెండి వస్తువులు, టాటా సఫారి కారు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసు విచారణలో కృషి చేసిన సెంట్రల్ ఏసిపి దామోదరరావు, టాస్క్ఫోర్స్ ఎసిసి లతకు మారి, సిఐ ఎ. సుబ్రహ్మణ్యం, సిహెచ్ ప్రకాష్, వాసిరెడ్డి శ్రీను, ఎ. పవన్ కిషోర్, ఎన్. రాజశేఖర్, డి. చవాన్, బి.చంద్రశేఖర్, కె. కిషోర్బాబులను, క్రైం డిసిపి డాక్టర్ కె. తిరుమలేశ్వరరెడ్డిని సిపి రాజశేఖర బాబు ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: