కుప్పం : డా బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే (Constitution) నేడు భారతదేశం ఐక్యంగా ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన కుప్పం లో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్న డూలేని రీతిలో దళితులు కష్టాలు, కన్నీటితో ఉన్నారన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)లో అంటరానితనం కన్పిస్తోందని దీన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్యమతం పేరిట బైబిల్ చదివే ఓ నిరుపేద ఫార్మసిస్ట్ను ఉద్యోగం నుంచి తొలగించడం చాలా దారుణమన్నారు. సమీపంలోనే ఉన్న వేలూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ (Medical college) లో వేలమంది హిందువులు, ముస్లింలు పనిచేస్తున్నారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణను అందరూ వ్యతిరేకిస్తు న్నారన్నారు. బిజెపిపాలనలో అరాచకం స్పష్టంగా ఉందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంతోనే నేడు దేశంలో అన్ని కులాలు, మతాలు, భాషలను కలుపుతోందన్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కుప్పం నుంచి మొదలైన రాజ్యాంగ పరిరక్షణ యాత్ర విజయ వంతం కావాలని అందుకు సంపూర్ణమద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ MORE :