ఎఐసిసి కార్యదర్శిగణేశ్కుమార్ యాదవ్
తిరుపతి : తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ (congress) పార్టీ పట్ల ప్రజాదరణ పెరుగుతోందని ఏఐసిసి కార్యదర్శి గణేశ్కుమార్యాదవ్, పిసిసి వర్కింగ్ అధ్యక్షుడు షేక్మస్తాన్వల్లీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని, గత వైసిపి ప్రభుత్వం ధోరణినే కూటమి అవలం భిస్తోందని విమర్శించారు. ఎన్నికలకు ముందు కూట మిప్రభుత్వం సూపర్సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని దుయ్యబట్టారు. ఆదివారం మధ్యాహ్నం తిరుపతిలోని ఓ ఫంక్షన్హాల్లో తిరుపతి జిల్లాకమిటీ, తిరుపతి నగర కమిటీల నాయకులతో ఏఐసిసి కార్యదర్శి గణేశ్కుమార్ యాదవ్, పిసిసి వర్కింగ్ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వల్లీ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పార్టీలో సీనియర్, జూనియర్ నేతలు, కార్యకర్తల వ్యక్తిగత అభిప్రాయా లను, ఎదర వుతున్న సమస్యలను, ప్రజల ఇబ్బం దులును, కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతపై లోతుగా సమీక్షించారు.
Read also: మంత్రుల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మహేశ్ కుమార్ గౌడ్

దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజాదరణ పెరుగుతోంది
కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ చింతామోహన్, పిసిసి ఉపాధ్యక్షుడు దొడ్డారెడ్డి రాంభూపాల్రెడ్డి, తిరుపతి సిటీ అధ్యక్షుడు గౌడపేర చిట్టిబాబు, జిల్లా అద్యక్షుడు బాలగురవంబాబు, కాంగ్రెస్ పార్టీ (congress) నాయకులు వెంకట నరసింహులు, పి.కమలమ్మ, వివిధ నియోజకవర్గాల నాయకులు పాల్గోన్నారు. అనంతరం ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఆ ఇద్దరు నాయకులు మాట్లా డుతూ గ్రామ, మండల స్థాయిలో ప్రజలు సమస్యలు తెలుసుకునేలా పార్టీ నాయకులు పనిచేయాలన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు అభిమానులు కలసి పనిచేసి విజచసాధన దిశగా కంకణబద్దులై పనిచేయా లన్నారు. ఓట్చోరీపై ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం ఈనెల 15వ తేదీలోపు పూర్తిచేయాలని సూచించారు. దేశరాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తు న్నాయని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుందని వివరించారు. 2029లో కేంద్రంలో రాహుల్గాంధీ నాయ కత్వంలో కాంగ్రెస్పార్టీ అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యమని నిర్దేశం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: