భారత రైల్వేలు దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రాణాధారంగా శతాబ్దాలుగా ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న సంస్థ. ప్రతి రోజు సుమారు 2.3 కోట్ల మంది రైలు ద్వారా ప్రయాణం చేస్తారు. 1853లో ప్రారంభమైన ఈ వ్యవస్థ దేశ ఐక్యత, చౌకైన ప్రయాణం, గ్రామీణ ప్రగతి, కార్మిక జీవనాధారం వంటి అనేక రంగా లకు మూలస్థంభంగా నిలిచింది. కానీ గత పదేళ్లుగా కేం ద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ‘సంస్కరణలు’ రైల్వే (Railway) వ్యవస్థను వాణిజ్యపరమైన దిశలో మలుస్తూ, సామా న్య ప్రజల సేవల నుండి దూరం చేస్తున్నాయన్న అభి ప్రాయం పెరుగుతోంది. ‘సంస్కరణ’ అనే పదం ఆచరణలో సాంకేతికత, సమర్థత, పారదర్శకతను సూచించాలి. కానీ భారత రైల్వేల్లో ఆ పదం ప్రస్తుతం ‘ప్రైవేటీకరణ’కు సమా నార్ధకమైపోయింది. ప్రభుత్వ పబ్లిక్ సెక్టార్ ఆత్మను దెబ్బ తీస్తూ, రైల్వే వ్యవస్థను కార్పొరేట్ దిశగా నడిపించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు నిర్ణయాలు చూపుతు న్నాయి. టికెట్ ధరల పెరుగుదల, సాధారణ స్లీపర్ కోచ్ ల సంఖ్య తగ్గించడం, రిజర్వేషన్ సౌకర్యాల కఠినతరం, ప్రైవేట్ భాగస్వామ్యాల విస్తరణ ఇవన్నీ సాధారణ ప్రజలకు ప్రతికూలంగా మారాయి. గత 10ఏళ్ల గణాంకాలను పరిశీ లిస్తే, 2014లో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ ట్రైన్లలో స్లీపర్ కోచ్ల సంఖ్య సుమారు 47,౦౦౦ ఉండగా, 2024నాటికి అది 38,000కు తగ్గింది. అదే సమయంలో ఎయిర్కండి షన్ (ఎసి) కోచ్ల సంఖ్య 19,000 నుండి 32,000కు పెరిగింది. అంటే సామాన్యుడు ఉపయోగించే స్లీపర్ సీట్లు 20శాతం తగ్గి, ధనవంతులకు అనువైన ఎసి సీట్లు 68 శాతం పెరిగాయి. వందే భారత్, తేజస్, బుల్లెట్ ట్రైన్ వంటి లగ్జరీ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించడం ఈ మార్పుకు కారణమైంది. ఇది ‘సబ్కా సాత్ సబ్కా వికాస్’ అనే నినాదానికి విరుద్ధంగా ఉంది.
Read Also : http://Train luggage: ట్రైన్ లో సెకండ్ క్లాస్ టికెట్ కు పరిమిత లగేజీ.. ఎక్కువైతే పైన్

బడ్జెట్లో విలీనం
రైల్వే బడ్జెట్ 2017లో సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం కూడా పారదర్శకతను దెబ్బతీసింది. అప్పటి నుండి రైల్వే ఆదాయం, ఖర్చులు, సామాజిక సేవా రాయితీలపై స్వతంత్ర చర్చలు జరగడం తగ్గిపోయాయి. కంట్రోలర్ ఆడిటర్ అండ్ జనరల్ (కాగ్) నివేదిక ప్రకారం, ప్యాసింజర్ సేవల నుండి వచ్చేఆదాయం మొత్తం రైల్వేరాబడిలో 2014లో 43శాతం ఉండగా, 2023లో అది 29శాతానికి పడిపోయింది. ఫ్రైట్ (సరకు రవాణా) ఆదాయం 63శాతానికి పెరిగింది. అంటే రైల్వేలు ప్రజా రవాణా కంటే వాణిజ్య రవాణాపైనే దృష్టి పెట్టాయి. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్టేషన్ రీ డెవల ప్ మెంట్ రైల్పేఎస్యూ మోనిటైజేషన్’, ప్రైవేట్ ట్రైన్ ఆప రేటర్ స్కీమ్’ వంటి సంస్కరణలు ప్రజా సేవల కంటే ఆదాయ వనరుల పెంపుపై ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. సుమారు 150 ట్రైన్డట్లు ప్రైవేట్ ఆపరేటర్లకు ఇవ్వాలన్న ప్రణాళిక ఉండగా, వాటి టికెట్ ధరలు ప్రస్తుత సాధారణ రేట్లకంటే 25-35 శాతం ఎక్కువగా ఉండేఅవకా శం ఉంది. ఇక స్లీపర్ కోచ్ల తగ్గింపు వల్ల గ్రామీణ మధ్య తరగతి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఐఆర్సిటిసి డేటా ప్రకారం, 2023-24 సంవత్సరంలో రిజర్వేషన్ వేటింగ్ లిస్ట్లో ఉన్న ప్రయాణికుల సంఖ్య 4.2 కోట్లకు చేరింది. ఈసంఖ్య 2015లో 2.8కోట్లుగా ఉండేది. అంటే సీట్లు తగ్గి, డిమాండ్ పెరిగిపోయింది. పేద ప్రజలు తక్కువ ధరలో ప్రయాణించే అవకాశం కోల్పోతున్నారు. డైనమిక్ ప్రైసింగ్ విధానం(విమాన టికెట్ల తరహా చార్జీలు) కూడా సాధారణ ప్రజల భారం పెంచుతోంది.
భిన్నమైన ధరలు
ఒకే రైలులో ఒకే కోచికి భిన్నమైన ధరలువసూలు చేయడం వల్ల పేద ప్రయాణికులు వెనక్కు తగ్గుతున్నారు. సీనియర్ సిటిజన్, విద్యార్థులు, రోగులు వంటి వర్గాలకు ఇచ్చే కన్సెషన్లు కూడా 2020 తర్వాత నిలిపివేయబడ్డాయి. గణాంకాల ప్రకారం, 2019లో 11.5 కోట్లమంది కన్సెషన్ పొందగా, 2023 లో అది2. 3 కోట్లకు పడిపోయింది. మరోవైపు, ఉద్యోగ నియామకాల తగ్గింపు కూడా గమనార్హం. 2015లో రైల్వేలో 15.3 లక్షల మంది పనిచేస్తుండగా, 2024లో అది 12.5 లక్షలకు తగ్గింది. సుమారు 3 లక్షల ఉద్యోగాలు ‘నాన్టికల్’ పేరుతో రద్దు అయ్యాయి. స్థానంలో అవుట్సోర్సింగ్ పెరిగిం ది. ఈ చర్యలు భద్రతా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. 2023లో రైల్వే ప్రమాదాల సంఖ్య 275 కాగా, 2014లో అది 160మాత్రమే. అంటే భద్రతా అంశా లు సాంకేతిక సంస్కరణల వెనుక మరిచిపోతున్నాయి. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్న ‘వందే భారత్’ ప్రాజెక్ట్ లు దేశవ్యాప్తంగా 100రైళ్లునడుస్తు న్నాయి. కానీ వీటిలో ప్రయాణించే వారిలో 90శాతం మంది మధ్యతరగతికి పై బడినవారు. సాధారణ స్లీపర్ ప్రయాణి కులు వీటికి దూరం గా ఉన్నారు. ఆ రైళ్ల టికెట్ ధరలు సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లకంటే సగటున 60శాతం ఎక్కువగా ఉన్నాయి. ఒక విశ్లేషణ ప్రకారం, సికిందరాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ సీటు ధర రూ.1640 ఉండగా, అదే మార్గంలోని సాధారణ రైలు స్లీపర్ టికెట్ రూ. 460 మాత్రమే. ఈ వ్య త్యాసం కేంద్ర ప్రభుత్వ రైల్వే (Railway) విధానదిశను స్పష్టంగా తెలి యజేస్తుంది. ప్రభుత్వం ‘సంస’్కరణలు’ పేరుతో తీసుకుంటు న్న నిర్ణయాల వల్ల సామాన్యుడు రైలు ప్రయాణం నుండి క్రమంగా దూరమవుతున్నాడు. నేషనల్ సాంపిల్ సర్వే (ఎన్ ఎస్ఎస్) 2023 గణాంకాల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల 62శాతం ప్రజలు రైల్వేబదులు బస్సులు లేదా ఇతర వాహ నాలను ఎంచుకుంటున్నారు. 2014లో ఆ సంఖ్య 41 శాతం మాత్రమే. కారణాలు -టికెట్ ధరలు, సీట్లులభించకపోవడం, ఆన్లైన్ సాంకేతిక అడ్డంకులు, సౌకర్యాల లేమి. భద్రత పరంగా కూడా పరిస్థితి ఆందోళనకరం.

కార్పొరేట్ మోడల్
సిగ్నల్ మానిటరింగ్, పాయింట్ మెషిన్ మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో సిబ్బం ది తగ్గిపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. అయిన ప్పటికీ, ప్రైవేట్ కంపెనీ లకు మెయింటెనెన్స్ కాంట్రాక్టులు ఇవ్వడం భద్రతా ప్రమాణాలను మరింత ప్రమాదంలో పడే స్తోంది. ఇక స్టేషన్ డెవలప్మెంట్ ప్రాజెక్టుల పేరుతో ప్రధాన నగరాల్లోని రైల్వే భూములను వాణిజ్య అవసరాల కోసం కేటాయించడం జరుగుతోంది. న్యూఢిల్లీ, ముంబై, లక్నో వంటి నగరాల్లో రైల్వే భూముల విలువ రూ.2.3 లక్షల కోట్లుగా అంచనా వేయబడగా, వాటిలో పెద్దభాగం కార్పొరేట్ ఒప్పం దాలకు కేటాయించబడింది. ఈ విధమైన సంస్కరణలు రైల్వేలను ప్రజా సేవారంగం నుండి రెవెన్యూ జనరేటింగ్ కార్పొరేట్ మోడల్’గా మార్చుతున్నాయి. ఇన్ని మార్పుల మధ్య సామాన్యుడు ఎదుర్కొంటున్న దైనందిన ఇబ్బందులు ప్రభుత్వ దృష్టికి రావడం లేదు. రిజర్వేషన్ పొందలేక రైలుబోగీలతో కిటకిటలాడే జనాలు, టికెట్ రేట్ల భారంతో వెనక్కు వెళ్లే విద్యార్థులు, స్టేషన్లో తాగునీరు లేదా టాయి లెట్ లేని పరిస్థితుల్లో ప్రయాణించే గ్రామీణ ప్రజలు ఇవన్నీ కేంద్రప్రభుత్వం గర్వంగా చెప్పుకునే ‘అమృత్ కాలం’కి విరుద్ధమైన దృశ్యాలు. అంతిమంగా చెప్పాలంటే, రైల్వే సంస్కర ణలు అవసరమే, కానీ అవి సేవాధోరణిని నశింపచేయకుండా ఉండాలి. స్లీపర్ కోచ్లు తగ్గించడం, ధరలు పెంచడం, ప్రైవే టీకరణపెరగడం ఇవన్నీ ప్రజా సేవకుబదులు లాభదాయక వ్యాపారం వైపు తీసుకెళ్తున్న సూచనలు. ప్రజల విశ్వాసం కోల్పోతే రైల్వే గాడి తిరగదు. రైల్వేలు భారత ప్రజాస్వామ్య పు ఇనుప నాడి. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న సంస్కర ణలు నిజంగా అభివృద్ధి దిశగా నడుస్తున్నాయా లేక ప్రజల సేవా దిశ నుండి తప్పిపోయాయా అనే ప్రశ్నకు సమాధా నం ఇప్పుడుప్రజల అనుభవంలోనే దాగి ఉంది. రైల్వే చక్రం గిరికీడుతూ ఉండాలంటే, దాని దిశ ప్రజల వైపు ఉండాలి, లాభాల వైపు కాదు.
– అప్పన్న గొనప
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: