యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి మంచి క్రేజ్ తెచ్చుకుంది శివ జ్యోతి. బిగ్ బాస్ హౌస్‌లోనూ సందడి చేసింది శివ జ్యోతి (Siva Jyothi). ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఆమె పలు టీవీ షోల్లో పాల్గొంటుంది. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల వీడియోలు చేస్తూ సందడి చేస్తుంది. అలాగే కొన్ని వివాదాల్లోనూ చిక్కుకుంది ఆమె.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది శివజ్యోతి.
Read Also: Bigg Boss 9: ఈ వారం హౌస్ నుండి వెళ్లిపోయేది ఆమేనా?
తిరుమల ప్రసాదం పై శివ జ్యోతి (Siva Jyothi) చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. శివజ్యోతి పై నెటిజన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనం సందర్భంగా క్యూ లైన్‌లో నిలబడి ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.ఇటీవల తిరుపతి దర్శనం, ప్రసాదం గురించి శివజ్యోతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి.
ఈ నేపథ్యంలో స్పందించిన ఆమె, తన తప్పును అంగీకరిస్తూ ఒక వీడియోను పంచుకున్నారు. “పొద్దున్నుంచీ తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందిని బాధించాయి. వివరణ ఇచ్చే ముందు హర్ట్ అయిన ప్రతి ఒక్కరికీ సారీ చెబుతున్నాను,” అని ఆమె పేర్కొన్నారు.
క్షమాపణ కోరుతున్నా
తాము రూ.10,000 ఖరీదైన ఎల్1 క్యూ లైన్‌లో వెళ్లామని, ఆ ఉద్దేశంతోనే ఖరీదైన లైన్ అని అన్నానని, అంతేకానీ ‘మేము ధనవంతులం’ అనే అహంకారంతో కాదని ఆమె స్పష్టతనిచ్చారు. తనకు వెంకటేశ్వర స్వామి అంటే ఎనలేని భక్తి అని, నాలుగు నెలలుగా శనివారం వ్రతాలు కూడా చేస్తున్నానని తెలిపారు.
“నాకు అత్యంత విలువైన నా బిడ్డను ఆ వెంకటేశ్వర స్వామే ఇచ్చాడు. అలాంటిది ఆయన గురించి నేనెలా తప్పుగా మాట్లాడతాను?” అంటూ భావోద్వేగానికి గురయ్యారు.యూట్యూబ్ ఛానెళ్లు, కేసుల భయంతో కాకుండా, అలా మాట్లాడి ఉండకూడదని నాకే అనిపించింది. అందుకే క్షమాపణ కోరుతున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు,” అని శివజ్యోతి స్పష్టం చేశారు. ఆమె క్షమాపణతో ఈ వివాదం సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: