“మానవ జీవనంతో ఆటలాడుకుంటున్న మాదక ద్రవ్యాలను నిరోధించే విషయంలో మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాల్సిన తరుణమిది. ఏదో ఒక రాష్ట్రం చర్యలు తీసుకుంటే ఈ మహమ్మారిని సమూలంగా నిర్మూలించే అవకాశాలు కన్పించడం లేదు. అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వా లు ఉమ్మడి కార్యాచరణను రూపొందించి అమలు చేయ గలిగితే కొంతమేరకైనా నియంత్రించవచ్చు. ఈ మాదక ద్రవ్యాల (Drugs) వ్యాపారం ఇప్పటికిప్పుడు ప్రారంభమైందని చెప్పడం లేదు. ఏనాటి నుంచో ఉన్నా తమ వ్యూహాలు, ప్రణాళికలు మార్చుకుంటూ ప్రపంచమంతా విస్తరిస్తున్నా యి. ముఖ్యంగా ఈ వ్యసనం ఇరవైఏళ్లలోపు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. మరోవైపు నేరాల సంఖ్య అదుపు లేకుండా పెరిగిపోతున్నది. మాదకద్రవ్యాల (Drugs)మత్తు లో వారు ఏంచేస్తున్నారో వారికే తెలియని పరిస్థితుల్లో చేయరాని, చేయకూడని పనులకు పాల్పడుతూ అవికప్పి పుచ్చుకునేందుకు హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ప్రపంచవ్యాప్తంగా డార్నెట్వారా మత్తు మందుల కొనుగోళ్లలోఆసియా ఖండం వాటా పద్నాలు గు శాతానికి పెరిగిపోయిందని అధికార లెక్కలే వెల్లడిసు న్నాయి. అందులో చైనా తర్వాత భారతే అగ్రస్థానం. రెండు దశాబ్దాల క్రితం భారతదేశంలో కోటి డెబ్బైలక్షల మంది మత్తుమందు వాడకందార్లు ఉండగా ప్రస్తుతం పది, పన్నెండు కోట్లకుపైగా చేరుకున్నట్లు అనధికార లెక్కలు వెల్లడిస్తున్నాయి. మత్తుమందు వాడకంలో పంజాబ్ అగ్రస్థానంలో ఉన్నట్లు అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో యేటా పదివేల కోట్ల రూపాయలకుపైగా మత్తు మందులపై ఖర్చుపెడుతున్నట్లు అంచనా. తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆమాట కొస్తే భారతదేశంలో ఇదే పరిస్థితి కొనసాగితే మరో దశాబ్దంనాటికి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన వ్యక్త మవుతున్నది. నిత్యం ఎక్కడో ఒక దగ్గర మత్తుమందులు పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా దేశ రాజధాని ఢిల్లీనార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు చేపట్టిన భారీ ఆపరేషన్లో రెండువందల అరవైరెండు కోట్ల రూపాయల విలువైన మూడువందల ఇరవై ఎనిమిది కిలోల మెథాన్పెట్టమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఢిల్లీ శివారు లోని ఒక ఫామ్హహౌస్లో ఈ మాదకద్రవ్యాలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు మొన్న 20వ తేదీన ఎన్సిబి అధికారులు దాడి చేయగా కొందరు విదేశీయులు పట్టుబడ్డారు. ఆ విచారణలో ఉత్తరప్రదేశ్లోని అమ్రోహ జిల్లా మంగౌలి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పేరు వెలు గుచూసింది. సదరు వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఆకస్మిక దాడులు నిర్వహించి నాగాలాండకు చెందిన ఒక మహిళతోసహా ఇద్దరిని అరెస్టు చేసి మరికొందరు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న అసలు నేరస్తుల కోసం గాలిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాదేశంలో ఎక్కడో ఒకచోట నిత్యం పట్టుబడుతూనే ఉన్నాయి. గతంలో గుజరాత్ లోని ముంద్రా పోర్టులో ఇరవైఒక్కవేల కోట్లరూపాయల విలువైన మూడువేల కిలోల హెరాయిన్ పట్టుబడినప్పుడు విజయవాడ లింక్లు వెలుగులోకి వచ్చాయి. మత్తు మందు సరఫరా కోట్లడాలర్ల వ్యవహారంలో ఎక్కువభాగం ఉగ్రవాద సంస్థలకే చేరుతున్నదని దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, ఉజ్బికిస్థాన్, మరికొన్ని ఆఫ్రికా దేశాలు ఇందులో విరివిగా పాల్గొంటు న్నాయి. కశ్మీర్ ఉగ్రవాదులకు పంజాబ్లో ని మత్తు మందుసరఫరాదారులకు గట్టి సంబంధాలు ఉన్నట్లే బయటప డింది. అయితే పట్టుబడుతున్నవి పదోవంతు కూడా లేదని చెప్పొచ్చు. మత్తు ముఠాలు సొంతంగా ఒక పెద్దనెట్వర్క్ను ఏర్పాటు చేసుకొని మారుమూల ప్రాంతాలకు రవాణా చేయగలిగిన రకరకాల మార్గాలను ఏర్పర్చుకున్నాయి. లాటిన్ అమెరికాలో తయారవు తున్నమత్తుమందు లు ప్రపంచ నలుమూలాలకు విస్తరించడంతోపాటు రసా యనాలు తయారు చేసే యంఫెటామైన్ టైప్టామైన్స్ ఎక్కడికక్కడ తయారవుతున్నాయి.బ్యాంకులు, ఇతర వ్యవస్థలతో సంబంధంలేకుండా సరాసరి ఒక ఖాతా నుంచి మరొకరి ఖాతాకు బదలీ చేయించగలిగే ‘క్రిప్టో కరెన్సీ’ వాడకం సైతం పెరగడంతో లావాదేవీలకు అదుపులేకుం డా పోతున్నది. గతంలో మత్తు మందులు కొనేవారు తెలి సిన వాడకందారులు, నమ్మకం ఉన్నవ్యాపారిని సంప్ర దించేవారు. మత్తుమందునుతీసుకొని డబ్బును చేతిలో పెట్టేవారు. ఆ వ్యాపారం కూడా అత్యంత రహస్యంగా, మూడో కంటికి తెలియకుండా మత్తు మందు తెప్పించి అప్పగించేవారు. అయితే ఇదిఅత్యంత పకడ్బందీగా జరు గుతున్నా నిఘా విభాగం అధికారులు కన్నువేయడంతో ఎక్కడో దగ్గర దొరికిపోయేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఇండియా లో మారుమూల ప్రాంతంలో కూర్చొని ఎక్కడో విదేశాల్లో ఉన్నమత్తుమందు వ్యాపారికి ఆర్డర్ ఇవ్వొచ్చు. మత్తు మందు రవాణా, చెల్లింపులు సులభం కావడంతో విక్రయాలువిపరీతంగా పెరిగిపోయాయి. ఇలా ఈ మహమ్మారి ప్రపంచమంతా విస్తరించింది. మెక్సికో కేంద్రంగా రకరకాల మార్గాల్లో అన్నిదేశాల్లో ప్రవేశిస్తున్న ది. యేటా కొకైన్,బ్రౌనషుగర్ లాంటి మాదక ద్రవ్యాలు రెండువేల టన్నుల వరకు ప్రపంచవ్యాప్తంగా సరఫరా అవుతున్నట్లు అనధికార అంచనాలను బట్టి తెలుస్తున్నది. లక్షలాది కోట్లవ్యాపారం జరుగుతున్నది. అందుకే ఈ మహమ్మారిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి వ్యూహం రూపొందించి నిర్మూలనకు అడుగులు వేయాలి. అంతే కాదుఈబాధ్యతంతా పాలకులపైవదిలిపెట్టకుండా స్వచ్ఛంద సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు, రాజకీయ పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన సమయమిది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: