ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈ నెల 14 నుంచి 16వ తేదీ వరకు న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. 14వ తేదీ సాయంత్రం హస్తినకు బయలుదేరనున్న ఆయన, రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి కేంద్ర సహాయం కోసం కీలక అభ్యర్థనలతో ఈ పర్యటనను సీఎం సీరియస్‌గా తీసుకుంటున్నట్టు సమాచారం.
కేంద్ర హోం, ఆర్థిక, జలశక్తి మంత్రులతో భేటీ
పర్యటనలో భాగంగా చంద్రబాబు ప్రధానంగా కేంద్ర హోం మంత్రి, ఆర్థిక మంత్రి, జలశక్తి శాఖ మంత్రి వంటి ముఖ్యమైన మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్రానికి నిధుల విడుదల, జలవనరుల పంపకం, విభజన అనంతర సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి మరిన్ని నిధులు సాధించేందుకు చంద్రబాబు తన అనుభవాన్ని ఉపయోగించనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
ఇతర శాఖల మంత్రులనూ కలిసే అవకాశం
ఈ భేటీలో ఇతర కేంద్ర శాఖల మంత్రులతో కూడి చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రాభివృద్ధి ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగావకాశాల కల్పన వంటి అంశాలపై ఆయన చర్చించనున్నట్టు సమాచారం. నేషనల్ హైవేలు, రైల్వే ప్రాజెక్టులు, విద్యా సంస్థల స్థాపనల గురించి కూడా ప్రతిపాదనలు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఈ పర్యటన రాష్ట్రానికి కీలకంగా మారుతుందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Read Also : Satyavathi Rathod : కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కీలక వ్యాఖ్యలు