ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు, పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణల అమలుకు గానూ ఈ పురస్కారం దక్కింది. (CM Chandrababu) ఈ సందర్బంగా, తనకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ప్రకటించడంపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ తరహా అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదని, ఈ అవార్డుకు క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనని ఆయన పేర్కొన్నారు.
Read also: AP: అల్లూరి హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై లోకేశ్ ఆదేశాలు

ఎకనమిక్ టైమ్స్ అవార్డు ప్రాముఖ్యతను గుర్తు చేసిన బాబు
ఎకనమిక్ టైమ్స్ అవార్డుపై కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ, విదేశీ వర్సిటీలు డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించినట్లు(CM Chandrababu) గుర్తుచేశారు. అయితే, ఈ అవార్డును గతంలో కేంద్రమంత్రులు అశ్విని వైష్ణవ్ (2024), ఎస్. జైశంకర్ (2023), నిర్మలా సీతారామన్ (2021), మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవిస్ (2019), కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ (2017), పీయూష్ గోయల్ (2015) వంటి వారు అందుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: