ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ శ్రీ వేంకటేశ్వర ఆలయంలో జరిగిన (Srikakulam Stampede) తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తొక్కిసలాట ఘటన కలచివేసిందని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) గాఢ సంతాపం తెలిపారు. ఆయన తన ట్వీట్‌లో ఈ విధంగా పేర్కొన్నారు.
Read Also: Vijayawada: విజయవాడ పశ్చిమ బైపాస్ రెడి

కాశీబుగ్గ వేంకటేశ్వరాలయంలో తొక్కిసలాట (Srikakulam Stampede) ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని CM చంద్రబాబు (CM Chandrababu) పేర్కొన్నారు..ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అటు మంత్రి లోకేశ్ (Minister Lokesh) ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డ వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: