సిఎం చంద్రబాబునాయుడు
విజయవాడ : సంక్షేమం అంటే పేదలకు చేసే దానం కాదు… వారి అభివృద్ధికి, సాధికారతకు మార్గం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకు అన్ని మార్గాలను వినియోగించుకుందామని చెప్పారు.
శుక్రవారం రాష్ట్ర సచివాలయంలోని ఐదో బ్లాకులో జరిగిన తొలి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్సులో భాగంగా ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ ప్రోగ్రామ్లు, సూపర్ సిక్స్ పథకాల (Super Six Schemes) అమలు, డ్వాక్రా, మెప్మా గ్రూపుల పనితీరు వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… “ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం
సంక్షేమం అభివృద్ధి రంగాలకు సమతూకంగా నిధులు ఖర్చు చేస్తున్నాం. మూలధన వ్యయం కూడా చేస్తూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం (Annadata Sukhibhava Scheme), తల్లికి వందనం అందరికీ అందించాం.
లబ్దిదారులకు సాయం అందే విషయంలో తలెత్తే చిన్నచిన్న లోటుపాట్లను కలెక్టర్లు సరిదిద్దాలి. మెగా డిఎస్సీ (Mega DSC) ద్వారా యువతకు 16,347 ఉద్యోగాలు వచ్చాయి. ఇప్పటికే 6 వేలకు పైగా పోలీసు విభాగంలో ఉద్యోగాలిచ్చాం. ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను గుర్తించి భర్తీ చేస్తాం.
గిరిజన యువతకే ఉద్యోగాలు ఇచ్చేలా
ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజన యువతకే ఉద్యోగాలు ఇచ్చేలా ఉన్న జీవో3ను సుప్రీం కోర్టు రద్దు చేసింది. దీనిపై ఏం చేయాలనే అంశంపై ఆలోచన చేస్తున్నాం. అలాగే ప్రైవేటు రంగంలోనూ జాబ్స్ జాబ్స్ వచ్చేలా పెట్టుబడులు ఆకర్షిస్తున్నాం. జిల్లాల్లో యువతకు ఉద్యోగాలు వచ్చేలా జాబ్ మేళాలు ఏర్పాటు చేయాలి.” అని ముఖ్యమంత్రి వివరించారు.
ఆర్టీసీ బస్సు (RTC bus) ల్లో ఉచిత ప్రయాణం స్త్రీ శక్తి విజయవంతమైంది. ఈవీ బస్సులతో ఖర్చు తగ్గుతుంది. కమర్షియల్ కాంప్లెక్సుల నిర్మాణం, కార్గో ద్వారా ఆర్టీసీ ఆదాయం సమకూర్చుకోవచ్చు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం ద్వారా ఏటా రూ.33 వేల కోట్ల వ్యయం చేస్తున్నాం. అక్టోబరు 1వ తేదీన 3 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.15 వేల ఆర్ధిక సాయం చేస్తాం.” అని చంద్రబాబు పేర్కొన్నారు.

విజయవాడలో హజ్ హౌస్ త్వరలోనే పూర్తి
వడ్డెర్లకు క్వారీల్లో రిజర్వేషన్లు పెట్టడంతో పాటు సీనరేజీలో మినహాయింపు ఇస్తాం. ఇమామ్, మోజన్లకు కూడా గౌరవవేతనం ఇస్తున్నాం. విజయవాడలో హజ్ హౌస్ త్వరలోనే పూర్తి అవుతుంది. హజ్ యాత్రికులకు రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాం. మసీదుల నిర్వహణకు నెలకు రూ.5 వేలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం.
కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. అన్ని దేవాలయ ట్రస్ట్ బోర్డు (Temple Trust Board) ల్లోనూ బ్రాహ్మణులకు చోటు కల్పించాం. నిర్మాణరంగంలో వర్కర్ల సంక్షేమం కోసం కూడా బోర్డు ఏర్పాటు చేస్తున్నాం.
మత్య్సకారుల సేవలో భాగంగా వేట నిషేధ
శాశ్వత కుల ధృవీకరణ పత్రం కూడా త్వరలోనే జారీ చేస్తున్నాం. అల్లూరి సీతారామరాజు పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెడతాం. కల్లుగీత కార్మికులకు మద్యం (Liquor for workers) దుకాణాల్లో రిజర్వేషన్లు కల్పించాం. తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యలపై విచారణకు ఆదేశించాం. మత్య్సకారుల సేవలో భాగంగా వేట నిషేధ సమయంలో రూ.20 వేలు ఇస్తున్నాం.
ఎవరికీ అన్యాయం జరక్కుండా ఎస్సీ వర్గీకరణను కూడా విజయవంతంగా పూర్తి చేశాం. డ్రైవర్ల సాధికారిక సంస్థ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నాం. నాయీ బ్రాహ్మణులకు రూ. 25 వేల చొప్పున వేతనం ఇస్తున్నాం. అర్చకులకు గౌరవ వేతనం రూ.15 వేలకు పెంచాం.
అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను
వేద విద్యార్థులకు రూ.3 వేలు ఇస్తున్నాం. జర్నలిస్టులకు ఇళ్లస్థలాల కేటాయించే అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అసంపూర్తిగా ఉన్న కాపు భవనాలను పూర్తి చేసేలా కార్యాచరణ చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని అదుకునేందుకు కార్యాచరణ చేపట్టాం.రజకులకు దోబీ ఘాట్లు, షెడ్లు, ఇస్త్రీ చేయడానికి ఆధునిక మోలిక వసతులు కల్పించాలి. 200 యూనిట్లు హ్యాండ్లూమ్కు, 500 యూనిట్లు పవర్ లూమ్స్ ఉన్నవారికి ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: