ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ (scrub typhus) వ్యాధి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల విజయనగరంలో ఈ వ్యాధి లక్షణాలతో ఓ మహిళ చనిపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఈ వ్యాధికి సంబంధించిన కేసుల నమోదుపై వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సౌరభ్ గౌర్‌తో రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు.
Read Also: CBN Tour : నేడు రెండు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటన
చిగ్గర్ మైట్ అనే కీటకం
ఇలాంటి ఘటనలు,మరెక్కడా జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. చిగ్గర మైట్ తరహా కీటకాలు కుట్టడం వల్ల వచ్చే వ్యాధితో పాటు, ప్రమాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దానిపై ప్రజలకు వివరించాలని అన్నారు.ఈ క్రమంలో చందక రాజేశ్వరి మృతికి సంబంధించిన అంశాలను ముఖ్యమంత్రికి సౌరభ్ గౌర్ వివరించారు. విజయనగరానికి చెందిన రాజేశ్వరికి చిగ్గర్ మైట్ అనే కీటకం కుట్టిందని, దీంతో ముందుగా టైఫాయిడ్ చికిత్స అందించారని…ఆ తర్వాత రాపిడ్ టెస్ట్ ద్వారా స్క్రబ్ టైఫస్ (scrub typhus) పాజిటివ్ అని తేల్చారని సౌరభ్ గౌర్ సీఎంకు వివరించారు.

విజయనగరం క్వాసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయారని అధికారులు చెప్పారు. స్క్రబ్ టైఫస్ కేసులు, ఆ వ్యాధి లక్షణాలు, అలాగే వాటి వల్ల ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం సూచించారు.ఓరింటియా సుసుగాముషి అనే బాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుందని, ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. చిగ్గర మైట్స్ అనే కీటకాలు కుట్టడం ద్వారా ఈ వ్యాధి వస్తుందని,
అధిక జ్వరం, చలి, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పులతోపాటు… మైట్ కుట్టిన తర్వాత పుండ్లు ఏర్పడడం వంటివి ఈ వ్యాధి లక్షణాలని ముఖ్యమంత్రికి తెలిపారు. సకాలంలో చికిత్స అందిస్తే, ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ ఏడాదిలో చిత్తూరు, కాకినాడ జిల్లాల్లో కేసులు నమోదు అయ్యాయని అధికారులు చెప్పారు.
Scrub Typhus ఎలా వస్తుంది?
చెట్ల దగ్గర, పొలాల్లో, అడవుల్లో ఉండే చిగర్ మైట్స్ కాటు వేస్తే ఈ వ్యాధి సోకుతుంది.
Scrub Typhus లక్షణాలు ఏమిటి?
ఎక్కువ జ్వరం
శరీరం నొప్పులు
తలనొప్పి
గొంతు నొప్పి
కాటు వేసిన చోట నల్లటి గాయంలాంటి స్పాట్ (Eschar)
వాంతులు
అలసట
Scrub Typhus ప్రమాదమా?
చికిత్స చేయకపోతే ప్రమాదకరం. కిడ్నీలు, ఊపిరితిత్తులు, మెదడు పై ప్రభావం చూపుతుంది. టైం లో చికిత్స చేస్తే పూర్తిగా క్షేమం అవుతుంది.
Scrub Typhus తో జ్వరం ఎన్ని రోజులు ఉంటుంది?
సాధారణంగా 5–7 రోజులు. కానీ మందులు వాడకపోతే వారం రోజులకంటే ఎక్కువగా ఉంటుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: