ఆంధ్రప్రదేశ్‌లో సీఎం చంద్రబాబు (CM Chandrababu) రేపు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు. కాగా ‘పేదలకు సేవలో’ కార్యక్రమంలో నేతలంతా పాల్గొనాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) పిలుపునిచ్చారు.
Read Also: AP: ‘పేదల సేవలో’ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలి: చంద్రబాబు

‘పేదల సేవలో’ కార్యక్రమం
రాజకీయ నాయకులు,నిత్యం ప్రజల్లోనే ఉంటూ, ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. పింఛన్ల పంపిణీని పేదల సేవగా భావించాలని నేతలకు తెలిపారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో నాయకుల భాగస్వామ్యం ప్రస్తుతం 25 వేలకు చేరిందని చంద్రబాబు వెల్లడించారు. ఇవాళ ఆయన నాయకులతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: