ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) కు ప్రతిష్ఠాత్మక ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించిందని మంత్రి లోకేశ్ తెలిపారు.. ‘ఈ ప్రతిష్టాత్మక అవార్డు చంద్రబాబుకు రావడం ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం. రాష్ట్రానికి, మా కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్ఠాత్మకం. సీఎం చంద్రబాబు సంస్కరణలను ధైర్యంగా ముందుకు తీసుకెళ్లారని జ్యూరీ ప్రశంసించింది.
Read Also: AP Digital Governance: అన్నీ ఇక ఇ- ఫైళ్లే..
సీఎం చంద్రబాబు నాయకత్వం ఆదర్శం
పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసంపై చూపిన నిబద్ధతకే ఈ అవార్డు నిదర్శనం. రాష్ట్రాభివృద్ధికి సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోంది.. పెట్టుబడుల ఆకర్షణ, సంస్కరణాత్మక పాలనకుఆదర్శంగా నిలుస్తున్నారు. సంస్కరణలే మార్గం-పాలనలో విశ్వాసమే మా లక్ష్యం’ అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: