హెక్టారుకు 50 వేలు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నిర్ణయం
విజయవాడ : రాష్ట్రంలో ఉల్లి ధరలు పతనం కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని గ్రహించిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతెలిపారు. శుక్రవారం సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియా తో మాట్లాడుతూ ఉల్లి పంట పండించిన రైతులకు హెక్టారుకు రూ.50,000 ఆర్థిక సాయం అందజేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu) నిర్ణయం తీసుకున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై సుమారు రూ.100 కోట్లు అదనపు భారం పడనుందని అన్నారు. కర్నూలు ఖరీఫ్ సీజన్ లో 45,278 ఎకరాల్లో ఉల్లి పంట సాగు చేసారని, 24, 218 మంది రైతులు లబ్ధిపొందుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు(Kinjarapu Atchannaidu)తెలిపారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ చర్యకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. పంటకు ధర పలికినప్పుడే ఉల్లిని విక్రయించాలని రైతులకు మంత్రి సూచించారు.
ఆర్థిక సాయం రైతులకి తక్షణ ఉపశమనం
మార్కెట్లో సమయానుసారం ధరలు లభించే వరకు రైతులు సహనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఆర్థిక సాయం రైతులకి తక్షణ ఉపశమనం లభిస్తుందన్నారు. 2016లో ఉల్లి ధరలు (Onion prices) పడిపోతే 7723 మంది రైతులనుండి 2.77 లక్షల క్వింటాళ్ళు కొనుగోలు చేసి 7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించామని, 2018లో మరొక సారి 9740 మంది రైతుల నుండి 3.48 లక్షల క్వింటాళ్ళ ఉల్లి కొనుగోలు చేసి 6.45 కోట్లు చెల్లించామని తెలిపారు.

జగన్ హయాంలో 2020 సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో ఉల్లి ధరలు పడిపోతే, నామ మాత్రంగా క్వింటాకి రూ.770లు మద్దతు ధర ప్రకటించి, ఏ ఒక్కరి దగ్గరా ఉల్లి కొనుగోలు చేయకుండా, కేవలం 250 మంది రైతుల దగ్గర 75 లక్షలు ఇచ్చి ఉల్లిని కొని రైతులని నిండా ముంచారని మండిపడ్డారు. రైతుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం (A coalition government) కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.
రైతుల సమస్యలను పరిష్కరించడం తమ ప్రభుత్వ ధ్యేయమని
రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతమని ఆయన అన్నారు. రైతుల శ్రమకు గౌరవం కల్పించేందుకు, వారికి న్యాయమైన ధరలు కూటమి లభించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వర్షాభావం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు భరోసా కల్పించే విధంగా పంటలకు కొనుగోలు ధరలు తగ్గితే ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ రైతులకు అండగా నిలబడుతుందన్నారు.
కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలిచి, వారిని ఆర్థికంగా బలఎ రిచే విధంగా పలు సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తోందని అన్నారు. కేవలం మాటలకే పరిమితమైపోయిన గత ప్రభుత్వం మాదిరి కాకుండా, మా ప్రభుత్వం రైతులకు సాక్షాత్కారమైన లాభాలను అందజేస్తుందని అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడం తమ ప్రభుత్వ ధ్యేయమని, భవిష్యత్తులో కూడా మరింతబలమైన విధానాలతో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: