విజయవాడ : వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలు మరింత మెరుగ్గా అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(CM Chandrababu) అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్(governance) కేంద్రంలో వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని.. అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని ముఖ్యమంత్రి ఆదేశించారు. నరేగా పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు. మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్ధంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం సూచించారు.
Read Also: Trump: ముస్లిం బ్రదర్‌హుడ్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తించే ప్రక్రియ ప్రారంభం

ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవటంతో పాటు సామర్ధ్యాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్సు ద్వారానే ప్రజల్లో సంతృప్త స్థాయి పెరుగుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించటం ద్వారానే దీనిని సాధించవచ్చని అన్నారు. పట్టణ,
గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు స్థానిక ప్రజాసంస్థల ఆమోదం తప్పనిసరి అని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) పనులకు సైతం ఇదే నిబంధన వర్తిస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (REAL TIME GOVERNANACE) కేంద్రంలో వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న
CM Chandrababu: ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమం ప్రజల్లోకి సమర్థంగా వెళ్లాలని, దీని కోసం మంత్రులు, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రజామోదం మేరకే పనులు చేపట్టాలని, అదేవిధంగా గ్రామాల్లో గ్రామసభల అనుమతి లేకుండా ఎటువంటి పనులూ ప్రారంభించవద్దని కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలు నుంచి పౌరసేవల లభ్యత వరకు ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం అత్యంత కీలకమని, దీనిపై నిరక్ష ్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రత్యేకంగా కెపాసిటీ బిల్డింగ్కార్యక్రమాలు ఆదేశించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: