రోడ్డు ప్రమాదంలో(AP) బ్రెయిన్ డెడ్ అయిన తమ కుమారుడి అవయవాలను దానం చేసి, ఐదుగురికి ప్రాణం పోసిన కర్నూలు జిల్లాకు చెందిన కుటుంబాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ కుటుంబం తీసుకున్న నిర్ణయం ఎంతో ఆదర్శనీయమని, సమాజానికి స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
Read also: TTD: తిరుమల పవిత్రతపై మచ్చా?.. మద్యం బాటిళ్లతో రచ్చ

బాలుడి కుటుంబానికి సీఎం చంద్రబాబు ప్రశంస
కర్నూలు జిల్లా(Kurnool District) ఓర్వకల్లుకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయ్యాడు. (AP) ఈ విషాద సమయంలోనూ ఆ బాలుడి కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకొచ్చి అవయవదానానికి అంగీకరించారు. వారి నిర్ణయం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఐదుగురికి కొత్త జీవితం లభించింది. ఈ గొప్ప త్యాగం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇదే సమయంలో, తిరుపతిలోని శ్రీ పద్మావతి హృదయాలయ వైద్యులను కూడా సీఎం అభినందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఒక యువతికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసినందుకు వైద్య బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: