దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా జయభేరి మోగించింది. విశాఖపట్నం ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో సఫారీ జట్టును చిత్తు చేసి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో భారత్ నెగ్గగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచింది. దీంతో ఇరు జట్లకు కీలకంగా మారిన ఆఖరి మ్యాచ్‌లో భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
Read Also: Nara Lokesh: టీమిండియా విజయం .. స్పందించిన మంత్రి లోకేశ్
భారత క్రీడాకారులు అద్భుతమైన నైపుణ్యం
భారత జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారత క్రీడాకారులు అద్భుతమైన నైపుణ్యం, పట్టుదల, సమష్టి కృషితో దక్షిణాఫ్రికాను ఓడించారని చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

ఈ కీలక మ్యాచ్‌కు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది ప్రతి క్రికెట్ అభిమానికి చిరకాలం గుర్తుండిపోయే రాత్రి అని తన సందేశంలో చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: