ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,(CM Chandrababu) సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ఆయన పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రియమైన మిత్రుడు, లెజెండరీ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సాధించిన విజయాలు, స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని కొనియాడారు. నా ప్రియ మిత్రుడు రజనీకాంత్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు! తెరపై మరియు నిజ జీవితంలో హీరోగా వెలిగే అతి కొద్దిమంది అగ్రతిమిదిలో ఆయన ఒకరు. ఆయన వ్యక్తిగత ప్రయాణం కూడా అతివిశేషమైనది, అది నిజంగా ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ఆయనకు ఈ రోజు మరెన్నో సంతోషాలు దక్కాలని కోరుకుంటున్నాను. నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తున్నాను! అని చంద్రబాబు తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు.
Read Also: ఒకేరోజు నాలుగు కంపెనీలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన..

చంద్రబాబు-రజనీకాంత్ స్నేహబంధం
చంద్రబాబు నాయుడు,(CM Chandrababu) రజనీకాంత్(Rajinikanth) మధ్య దశాబ్దాలుగా బలమైన స్నేహబంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గతంలో అనేక బహిరంగ సభల్లో ఇరువురూ తమ స్నేహాన్ని, ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. చంద్రబాబు లాంటి రాజకీయ నాయకుడు చాలా అరుదని రజనీకాంత్ పలు సందర్భాల్లో ప్రశంసించగా, రజనీకాంత్ వ్యక్తిత్వాన్ని చంద్రబాబు కూడా ఎన్నోసార్లు కొనియాడారు. ఈ నేపథ్యంలో రజనీ పుట్టినరోజున చంద్రబాబు చేసిన పోస్ట్ వారి స్నేహానికి నిదర్శనంగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: