ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) విజయదశమి పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలకు తన శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా సందేశం పంచుకున్నారు. దసరా (Dussehra) పండుగకు ప్రత్యేకమైన ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయ విలువలను గుర్తుచేస్తూ, ప్రజలందరికీ శాంతి, ఐశ్వర్యం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు.
Homes for All : 2029 నాటికి అందరికీ ఇళ్లు- CM చంద్రబాబు
శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే ఈ నవరాత్రి సందర్భంగా అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని తొమ్మిది అవతారాల్లో దర్శించుకున్నాం. రాక్షస సంహారంతో లోకానికి శాంతి సౌభాగ్యాలు తెచ్చిన ఆ తల్లి చల్లని చూపు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంపై ఇదే విధంగా కొనసాగాలి” అని ఆయన పేర్కొన్నారు.

పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు
సంక్షేమం, అభివృద్ధితో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగించే నైతిక బలాన్ని ప్రసాదించాలని ఆయన ఆకాంక్షించారు. అనునిత్యం పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్లు (Anna Canteens), పేదల సేవలో పెన్షన్లు, మహిళామతల్లులకు ఆసరాగా నిలిచే ‘దీపం’,
ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘స్త్రీశక్తి’, బిడ్డలను విద్యావంతుల్ని చేసే ‘తల్లికి వందనం’, రైతుకు అండగా నిలిచే ‘అన్నదాత సుఖీభవ’, పేదల చేయిపట్టి అభివృద్ధి వైపు నడిపే ‘పీ4’ విధానం, పారిశ్రామిక ప్రగతితో ఈ దసరా పండుగ ఇంటింటా వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: