విజయవాడ : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు లేటుగా హాజరై.. కొద్దిసేపు సభలో ఉండి.. ఆ వెంటనే ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించి.. వారిపై సీరియస్ అయ్యారు.
గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి.. సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. విషయాన్ని సిఎం చంద్రబాబు గమనించి.. ఎమ్మెల్యేల హాజరుపై చీఫ్ వీప్ జివి ఆంజనేయులును ఆరా తీశారు. ఆయన వెంటనే అసెంబ్లీ (Assembly) లోని వీప్లను అప్రమత్తం చేశారు.
AU student death : వీసీ రాజీనామా చేయాలంటూ విద్యార్థుల ఆందోళన

హాజరుకాని ఎమ్మెల్యేలకు సైతం విప్లు
దీంతో అప్పటికప్పుడు అసెంబ్లీకి హాజరుకావాలంటూ సుమారు 15 మంది ఎమ్మెల్యేలను ఆదేశించారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలకు సైతం విప్లు (Whip) ఫోన్లు చేసి ఎందుకు హాజరు కాలేదంటూ ప్రశ్నిస్తున్నారు.
ప్రజా సమస్యలు.. రాష్ట్రాభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీ చక్కటి వేదిక అని సిఎం చంద్రబాబు నాయుడు నమ్ముతారు. అందుకే ఆయన ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరువుతారు. ఆ క్రమంలోనే అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలంటూ వైఎస్సార్సీపి అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యే లకు ఆయన కీలక సూచన చేశారు. అలాంటిది ఎమ్మెల్యేలు సైతం అసెంబ్లీ సమావేశాలకు ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: