ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సోమవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గ అమ్మవారిని (Goddess Durga) దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Asia Cup 2025: టీమిండియా విజయంపై పవన్ కల్యాణ్ హర్షం
సతీసమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, కొల్లు రవీంద్ర, దుర్గగుడి అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, గాజులను అందజేశారు.

చంద్రబాబు, భువనేశ్వరి దంపతులకు పండితులు శాస్త్రోక్తంగా వేదాశీర్వచనం పలికారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రి (Indrakeeladri) పై దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.
పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పించడం ఆనవాయితీ
ఉత్సవాల్లో ఎనిమిదో రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో బెజవాడ దుర్గమ్మ సరస్వతీ అలంకరణంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఏటా మూలా నక్షత్రం రోజున అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి సమర్పించడం ఆనవాయితీ. అందుకే ఈ రోజున చంద్రబాబు నాయుడు దంపతులు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: