సత్యసాయి జిల్లా : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో మెగా పేరెంట్ టీచర్ మీట్ (పిటిఎం) కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఇలా కొనసాగునుంది. అధికార వర్గాలు తెలియజేసిన మేరకు ముఖ్యమంత్రి పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి ఉదయం 8 గంటలకు ఉండవల్లి నుండి విజయవాడ ఎయిర్పోర్ట్ బయలుదేరి 8:10 కి చేరుకుంటారు. 8.15 గంటలకు విజయవాడ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి ఉదయం 9 గంటలకు శ్రీ సత్యసాయి విమానాశ్రయం చేరుకుంటారు. 9:10 గంటలకు ఎయిర్ పోర్ట్ నుండి బయలుదేరి 9:25 గంటలకు కొత్తచెరువులోని శ్రీ సత్యసాయి (Sri Sathya Sai) ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానానికి చేరుకుంటారు.

మెగా పేరెంట్ టీచర్ మీట్
9:30 గంటల నుండి 9:50 గంటల వరకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఇష్టాగోష్టి నిర్వహిస్తారు. 9:55 నుండి మధ్యాహ్నం 1:00 వరకు మెగా పేరెంట్ టీచర్ మీట్ సభలో పాల్గొంటారు. ఒంటిగంటకు కొత్తచెరువు (Kothacheruvu) లోని బాలుర జడ్పీహెచ్ఎస్ స్కూల్ను సందర్శించి అక్కడినుండి పుట్టపర్తి ప్రశాంత నిలయంకు 1:15 గంటలకు చేరుకుంటారు. 02:15 గంటల వరకు ప్రశాంతి నిలయంలో గడిపిన అనంతరం అక్కడి నుండి బయలుదేరి 02:25 గంటలకు శ్రీ సత్య సాయి విమానాశ్రయంకు చేరుకోనున్నారు. 02:35 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 3:30 గంటలకు విజయవాడ విమానాశ్రయం (Vijayawada Airport) కు బయలుదేరి వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలియజేశాయి.
నారా చంద్రబాబు నాయుడు జన్మస్థలం ఏది?
నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నారావారి పల్లె అనే గ్రామంలో 1950 ఏప్రిల్ 20న జన్మించారు.
చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రముఖ సంస్థ ఏది?
నారా చంద్రబాబు నాయుడు స్థాపించిన ప్రముఖ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్. ఇది డైరీ, రిటైల్, అగ్రి రంగాల్లో సేవలు అందిస్తున్న కంపెనీ.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Vijayawada: సచివాలయ ప్రవేశ విధానంలో మార్పులు