విజయవాడ: మద్యం దుకాణాల్లో 100 శాతం డిజిటల్ చెల్లింపులు (Digital payments) అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్దమవుతుంది. సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగిన కలెక్టర్లు సదస్సులో ఏక్సైజ్ శాఖకు సీఎం చంద్రబాబు ఆ దిశలో ఆదేశాలు జారీ చేసారు. బెల్ట్ దుకాణాలు పెరగడానికి ఇదోక కారణంగా సీఎం చంద్రబాబు అభిప్రాయం అభిప్రాయపడ్డారు. ఒక రకంగా ఇలా చేయకపో వడం వల్ల మనమే అవకాశం ఇచ్చి మళ్లీ నిఘాపెట్టి లేని పోని సమస్యలు తెచ్చుకుంటున్నామని సీఎం వ్యాఖ్యానించారు. ఇకపై పూర్తిగా డిజిటల్ చెల్లింపులు చేపట్టిన దుకాణాలకు తదుపరి కేటాయింపుల్లోనూ ప్రాధాన్యం ఇద్దామని చంద్రబాబు కలెక్టర్ల సదస్సులో అధికారులకు సూచిం చారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుదల రాబడి లోనూ కనిపించాలి.
ఇకపై జిల్లా కలెక్టర్లు ఈ అంశాన్ని పరిశీలించి తదుపరి సమావేశానికి ఫలితాలు సాధించాలని సీఎం అన్నారు. ఎర్రచందనం నుంచి తగిన ఆదాయం పొందలేకపోయాం. మంచి బొమ్మలు తయారు చేసేవారిని తీసుకు వచ్చి తిరుపతి ఎర్రచందనం (Tirupati Red Sandalwood) డిపోలోనే తయారు చేయిద్దాం. దీనివల్ల అధికంగా ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది. ఎర్రచందనం రూ. లక్ష కోట్ల ఆస్తి. సరిగా ఉపయోగించుకోవాలి. ఎర్రచందనంపై ఎంతో ఆశ పెట్టుకున్నా నిరాశపరిచారు. ఎర్రచందనానికి విలువ పెంచి మనమే అమ్ముదాం, ఆదాయం పెంచుకుందాం, పరిశీలించండని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16శాతం ఎక్కువనీ
ఆదాయార్జన శాఖలపై సమీక్షించిన సందర్భంగా అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయని సీఎం వెల్లడించారు. ఇదే సందర్భంలో బార్లఏర్పాటుకు సంబంధించి ఏమిటి ఇబ్బందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దుకాణాల కన్నా బార్లకు సరఫరా చేసే మద్యం ధర 16శాతం ఎక్కువనీ, ఇది సమస్యగా ఉందని ముఖ్య కార్యదర్శి మీనా (Chief Secretary Meena) వివరించారు. పర్మిట్ రూమ్లకు అనుమతి ఇచ్చి ఆ తర్వాత బార్ల ఏర్పాటుకు ముందుకు రావడంతో సమస్య ఏర్ప డిందని ఒకరిద్దరు అధికారులు అభిప్రాయపడ్డారు. కారణాలు అన్వేషించి తన వద్దకు రావాలని, పరిష్కారాలు వెదుకుదామని సీఎం చంద్రబాబు వివరించారు.
జీఎస్టీ కొత్త శ్లాబులు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తున్నాయి. ఎంఆర్పీలో అది ప్రతిబింబిస్తోందో లేదో పరిశీలించాలని సీఎం కోరారు. జీఎస్టీ తగ్గింపు, ప్రజలకు ప్రయోజ నాలు, ఇతర అంశాలపై నెల రోజుల పాటు ప్రచారం చేపడదామనీ, యోగా విషయంలో ఎలా చేశామో అలాగే చేద్దామనీ బీమాపై జీఎస్టీ (GST) తగ్గించినందున ప్రభుత్వం కడుతున్న బీమా విష యంలోనూ ఆ ఫలితాలు పొందేందుకు ఉన్న అవ కాశాలను అన్వేషించండి అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ వల్ల ప్రజలకు ప్రతి ఏటా నేరుగా రూ.8,000 కోట్ల మేర ప్రయోజనం దక్కుతుందని వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ బాబు చెప్పారు.

శిక్షల శాతం పెంపుపై దృష్టి సారించడంతో పాటు నేరం జరిగిన
జీఎస్టీ లైసెన్సుల రిజిస్ట్రేషన్లను సులభతరం చేశారు. జీఎస్టీ రిజిస్ట్రేషన్ 3 రోజుల్లో పూర్తి చేస్తున్నందున మిగిలిన శాఖలూ అలాంటి అవకాశాలు పరిశీలించాలి అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏలూరు జిల్లాలో గనుల నుంచి ఆదాయం ఎందుకు బాగా తగ్గిందో చూడాలి. గనులు అన్ని చోట్లా ఒకే తరహాలో ఉండవు. జిల్లాలను 3 గ్రూపులుగా విభజించి పరిశీలించాలి. ఉచిత ఇసుక వల్ల రూ.1,000 కోట్లు ప్రతి ఏటా కోల్పోతున్నా ప్రజలకు సంతృప్తి స్థాయి తక్కువగా ఉంది. అవసరమైన మార్పులు చేయాలి.
ఏపీలో ఏడాది వ్యవధిలో 33 శాతం మేర నేరాల్ని తగ్గించాలని, అదే సమయంలో ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు సదస్సులో సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాలపై ఏపీ డీజీపీ కార్యాలయం ప్రత్యేక సమాచార పత్రాన్ని విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నివేదికలు, రికార్డుల్లో ఏపీలో నేరాలు తగ్గాయనే విషయం ప్రస్ఫుటంగా కనిపించాలన్నారు. శిక్షల శాతం పెంపుపై దృష్టి సారించడంతో పాటు నేరం జరిగిన గంటలోగా ఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ ఆధారాలన్నీ సేకరించాలని సూచించారు.
పోలీసింగ్ కార్యక్రమాలను మిగతా జిల్లాల్లో ఎందుకు చేయలేకపోతున్నారని
ఇకపై జిల్లాలవారీగా ఏయే నేరాలు జరుగుతున్నాయి? శిక్షల శాతం ఎంత మెరుగుపడిందనే దానిపై సమీక్షిస్తానని తెలిపారు. విజయవాడ, ఏలూరుల్లో అమలు చేసిన సాంకేతిక పోలీసింగ్ కార్యక్రమాలను మిగతా జిల్లాల్లో ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. నిర్దేశిత కాలవ్యవధి పెట్టుకుని రాష్ట్రమంతటా వాటిని అమలు చేయాలని తేల్చిచెప్పారు.
ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో అమలు చేస్తున్న సురక్ష 360 డిగ్రీ కార్యక్ర -మంలో ప్రజల్ని భాగస్వాములను చేయాలని వారు కూడా స్వచ్ఛందంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకొచ్చేలా చూడాలని చెప్పారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా నేరాలు జరుగుతున్నాయో సవివరంగా విశ్లేషణలు తయారు చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: