ఆంధ్రప్రదేశ్ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ (Sanjay) కు సుప్రీంకోర్టు (Supreme Court) లో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో అవినీతి ఆరోపణలపై ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరైన విధానాన్ని పాటించలేదని స్పష్టంగా పేర్కొంటూ బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అగ్నిమాపక శాఖలో అవినీతిపై ఎఫ్ఐఆర్
ఈ వివాదానికి కారణమైన కేసు — అగ్నిమాపక శాఖలో జరిగిన అవినీతికి సంబంధించినది. ఈ కేసులో మాజీ అధికారి సంజయ్ (Sanjay) పై ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కేసు నమోదు సమయంలో ఆయన సీఐడీ చీఫ్‌గా వ్యవహరిస్తుండగా, అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి.
హైకోర్టు బెయిల్‌పై ప్రభుత్వ అభ్యంతరం
ఈ ఎఫ్ఐఆర్ దృష్ట్యా సంజయ్ హైకోర్టు (High Court) లో ముందస్తు బెయిల్ కోరగా, న్యాయస్థానం ఆయనకు ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుతో అసంతృప్తి చెందిన రాష్ట్ర ప్రభుత్వం, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు విచారణ పద్ధతి, తీర్పు కారణాలపై ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఈ కేసు సుదీర్ఘ వాదనలు, వివాదాల మధ్య సుప్రీంకోర్టులో న్యాయస్థానం గురువారం తీర్పు వెలువరించింది. జస్టిస్ ఎన్.వి.ఎన్ భట్టి, జస్టిస్ అమానుల్లా ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పును తప్పుపడుతూ, ముందస్తు బెయిల్ దశలోనే ట్రయల్ తీరుగా వ్యాఖ్యానించిందని మండిపడింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Minister Narayana : సింగపూర్ లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన-రేపు మలేషియాకు మంత్రి