Pulivendula CI issue : పులివెందుల మాజీ సీఐ శంకరయ్యపై ప్రభుత్వం చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను సర్వీసు నుండి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే మేరకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా డిస్మిస్ ఆర్డర్‌ను ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం శంకరయ్య వీఆర్‌లో ఉన్నారు.
Read also: Reservation-GO: 50% పరిమితిలోనే కొత్త రిజర్వేషన్లు—GO సిద్ధం
ఇక అసెంబ్లీలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతున్నప్పుడు, సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి సీఐ శంకరయ్య పేరు ప్రస్తావించారు. (Pulivendula CI issue) వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసే పనులు శంకరయ్య సమక్షంలో జరిగాయని ఆరోపించారు. సంఘటనా స్థలంలో శంకరయ్య ఉన్నా అడ్డుకోలేదని కూడా విమర్శించారు.
ఈ ఆరోపణలకు శంకరయ్య తీవ్రంగా వ్యతిరేకిస్తూ, సీఎం చంద్రబాబుపై లీగల్ నోటీసులు పంపారు. తన పరువుకు భంగం కలిగించారని, అందుకు 1.45 కోట్లు పరిహారం చెల్లించాలని, అలాగే 15 రోజుల్లో బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు. పోలీసు డిపార్ట్‌మెంట్‌లో 29 ఏళ్లుగా నిజాయితీగా పనిచేశానని కూడా నోటీసులో పేర్కొన్నారు.
ఏకంగా ముఖ్యమంత్రికే నోటీసులు పంపడం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చగా మారింది. ఇదే సమయంలో, శంకరయ్య వ్యవహారంపై నివేదికలు సమీక్షించిన ఉన్నతాధికారులు, క్రమశిక్షణా లోపాల కారణంగా ఆయనను సర్వీసు నుంచి తొలగించే నిర్ణయం తీసుకున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :