ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా(Chittoor accident) పర్యటనలో దుర్ఘటన చోటుచేసుకుంది. పలమనేరు మండలం ముసలిమడుగు వద్ద ఆయన కాన్వాయ్ ఓ మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ కాలికి తీవ్ర గాయమైంది. వివరాల్లోకి వెళ్తే, పవన్ కళ్యాణ్ ఇవాళ పలమనేరు సమీపంలోని కుంకీ ఏనుగుల శిక్షణ శిబిరాన్ని సందర్శించడానికి వెళ్లారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు, ప్రజలు రహదారి ఇరువైపులా గుమిగూడారు. అభిమానుల ఉత్సాహం కారణంగా తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఒక మహిళ కిందపడిపోయింది.
Read Also: AP Crime: సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రగ్స్ డాన్ అరెస్ట్

ఆ సమయంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కాన్వాయ్ అక్కడుగా దూసుకెళ్తుండగా,(Chittoor accident) కిందపడిన మహిళ కాలిపై వాహనం చక్రం దూసుకెళ్లింది. ఆమె నొప్పితో అరిచేయడంతో, సమీపంలో ఉన్న స్థానికులు వెంటనే స్పందించి ఆమెను రోడ్డుపై నుంచి తొలగించారు. అనంతరం బాధితురాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సమాచారం ప్రకారం, ఆమె కాలికి తీవ్రమైన గాయం అయ్యిందని, ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారని తెలిపారు. అభిమానుల తాకిడి, భద్రతా లోపాల వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: