తిరుపతి : మోడీ ప్రధాని అయిన వెంటనే, తాను అహ్మదాబాద్లో ఆయన గురించి అడిగానని,(Chintamohan) మోడీ చదివింది నాలుగవ తరగతి మాత్రమే అని ఆయనకు చరిత్ర తెలియదని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతారని మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ దెబ్బతీలేదని, కాంగ్రెస్(Congress) పార్టీలోని కొన్ని కుటుంబాలు దెబ్బతీశాయని విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. జనగణమన గీతాన్ని జాతీయగీతం చేసింది మహాత్మా గాంధీ ఆలోచనని, 1928లో కలకత్తాలో ఏఐసీసీ సభా వేదికపై మహాత్మా గాంధీ వున్నారని రవీంద్రనాథ్ ఠాగూర్ సభవేదికపై కొచ్చి జనగణమన గీతం పాడారని, విన్న గాంధీ మదనపల్లెకు వెళ్లి, బీటీ కాలేజీలో ప్రిన్సిపల్గా ఉన్న బీసెంట్ అనే ఆయనను కలవమని చెప్పారని, గాంధీ సూచన మేరకు రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లె బిటి కాలేజీకి వచ్చి, అనిబిసెంట్ ను కలిసి, నాలుగు రోజులు అక్కడే ఉండి, జనగణమన గీతానికి లయ, ప్రాస కూర్పు నేర్చుకున్నారని చెప్పారు. మోడీ నెహ్రు పై చేసిన విమర్శలను రాజకీయ విమర్శలుగా చింతామోహన్ పేర్కొన్నారు. నెహ్రూ చనిపోయి అరవై సంవత్సరాలు కావస్తున్న ఇప్పుడు విమర్శించడమేంటని ప్రశ్నించారు. 1982 83లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, పివిఆర్ కె ప్రసాద్ ఈవోగా ఉన్నప్పుడు, 25 రూపాయలతో దర్శనం మొదలు పెట్టామని, వరాహస్వామి గుడి దగ్గర నుంచి, చిన్న క్యూ లైన్ ద్వారా భక్తులను అనుమతించే వాళ్ళమని, టిటిడి ప్రతిష్టతను పెంచింది స్థానికులు, కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
Read also: తిరుమలలో భారీ మోసం? పాలిస్టర్‌ను సిల్క్‌గా అమ్మిన స్కామ్…

టీటీడీపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
స్థానికుల(Chintamohan) పట్ల టీటీడీ చిన్న చూపు చూస్తోందని, కోటీశ్వరులకు విఐపి దర్శనం ఇస్తున్నారన్నారు. బిజెపి, టిడిపికి, దర్శనప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వైకుంఠ ఏకాదశికి కాంగ్రెస్ పార్టీ తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం ఇచ్చామని, కూటమి ప్రభుత్వంలో ఇవ్వడం లేదన్నారు. ఈ మధ్యకాలంలో న్యాయస్థానాలు ఇస్తున్న జడ్జిమెంట్లు సరిగ్గా లేవని ముఖ్యమంత్రికి ఒక రూలు? బతకలేని బడిపంతులకు మరో రూలా వుంది అన్నారు. రాజశేఖర్ రెడ్డిని మంత్రిని, ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీయే. రాజశేఖర్ రెడ్డి సొంత తమ్ముడు వివేకానంద రెడ్డిని యంపీని, మంత్రిని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. వైయస్సార్ కొడుకు జగన్మోహన్ రెడ్డిని యంపీని చేసింది కాంగ్రెస్, రాజశేఖర్ రెడ్డే కాంగ్రెస్ పార్టీని గెలిపించారనే వ్యాఖ్యలతో ఏకీభవించనన్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ, ఆయన బిడ్డలు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లారు. విజయ భాస్కర్ రెడ్డిని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. ఆయన బిడ్డలు కూడా కాంగ్రెస్ను వదిలి వెళ్లారని, చెన్నారెడ్డిని రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసింది కాంగ్రెస్. ఆయన బిడ్డలు సైతం పార్టీని విడిచిపెట్టి వెళ్లారన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్ల పైకొచ్చిన కుటుంబాలు పార్టీకి నష్టం చేశారని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి గౌడ్, రవి, తేజోవతి, శాంతి యాదవ్, మునిశోభ, వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: