हिन्दी | Epaper

Department of Finance : ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

Uday Kumar
Department of Finance : ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

సమీక్షలో ఆర్థిక శాఖ స్థితిగతుల పరిశీలన
హైదరాబాద్, మార్చి 22 :- రాష్ట్ర ఆర్థిక శాఖ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. మరో వారంలో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ఆర్థికశాఖ స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు.

కేంద్ర నిధుల సమీక్ష
కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై రివ్యూ చేశారు. ముఖ్యంగా, కేంద్రంలోని ఆయా శాఖల నుంచి రావాల్సిన నిధులు త్వరగా విడుదల అయ్యేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు.

సకాలంలో నిధుల విడుదలకు చర్యలు
కేంద్ర పథకాల సమగ్ర వివరాలను సమర్పించి, ఆర్థికశాఖ ద్వారా నిధులు సకాలంలో విడుదల అయ్యేలా చూడాలని సూచించారు. మొత్తం 5 శాఖల నిధులు రావాల్సి ఉందని అధికారులు వివరించగా, కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు నిధులు తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు
హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్థికశాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ హాజరయ్యారు. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

BYST తో ఏపీ ప్రభుత్వం భాగస్వామ్యం

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

కావూరి మృతి అంటూ వచ్చిన వార్తలను ఖండించిన కుటుంబ సభ్యులు

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

ఏపీలో రానున్న రెండు రోజులు వర్షాలు!

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు వీఐపీ దర్శనాలు నిలిపివేత

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

రిటైనింగ్ వాల్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్!

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

మచిలీపట్నం మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఇకలేరు

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

నాన్న అంత్యక్రియలు చేయని కూతుళ్లు.. వృద్ధాశ్రమంలోనే ఖననం

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

యూట్యూబ్ చూసి నకిలీ మద్యం తయారీ

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!
0:21

నెయ్యి ట్యాంకర్ బోల్తా.. బిందెలతో ఎగబడ్డ జనం!

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

అనుమానంతో భార్యను హత్య చేసి.. మృతదేహాన్ని లారీలో తీసుకెళ్లిన భర్త

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

ఐదో రోజు విచారణకు సునీల్ నాయక్

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

దేశంలోనే అతి పెద్ద మూడో తేరు.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు!

📢 For Advertisement Booking: 98481 12870