ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (Telangana State Formation Day) సందర్భంగా తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “ఎక్స్” వేదికగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు జాతి ఐక్యతపై చంద్రబాబు దృష్టి
చంద్రబాబు గారు తన ట్వీట్‌లో (tweet) తెలుగు రాష్ట్రాలు రెండు వేర్వేరు రాజకీయ పాలనా ప్రాంతాలుగా ఉన్నా, తెలుగువారందరూ ఒకే జాతి అని భావిస్తూ ఆ ఐక్యతను బలపరచాలని కోరారు. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని ఆయన ట్వీట్ చేశారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధికి ఆకాంక్షలు
“తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటే. తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే నా ఆలోచన, ఆకాంక్ష. 11వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు నా శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో జీవించాలని, అభివృద్ధి పథంలో సాగాలని కోరుకుంటున్నాను.
భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల పోటీ, వికాసం
“రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ” అని చెబుతూ, చంద్రబాబు 2047 నాటికి భారతదేశంలో తెలుగు రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగు జాతి తిరుగులేని శక్తిగా నిలవాలని ఇందులో ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని ఆకాంక్షిస్తున్నాను” అని చంద్రబాబు తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.
Read also: Pawan Kalyan: రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్
Read also: Kollu Ravindra: బియ్యం వద్దనుకునే వారికి నగదు..మంత్రి కొల్లు రవీంద్ర కీలక ప్రకటన