2029 నాటికి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తెలిపారు. అన్ని వర్గాల పేదలకు గృహ స్థలాలు (Housing plots for the poor) అందించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఆయన స్పష్టం చేశారు.

పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు స్థలం
పట్టణ ప్రాంతాల్లో నివాసితులకు 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలాన్ని అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం చెప్పారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ ప్రక్రియ ప్రారంభమైందని, అర్హులైన వారికి పట్టాల పంపిణీ కొనసాగుతుందని వివరించారు.
పదేళ్ల తరబడి నివాసం ఉంటే రెగ్యులరైజేషన్
పేదలు గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తూ వస్తే, వారికి రెగ్యులరైజేషన్ ద్వారా భూములు కేటాయించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎమ్మెల్యేలతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపి పట్టాలు పంపిణీ చేయడాన్ని సీఎం ప్రశంసించారు.
నెల్లూరు భగత్‌సింగ్ కాలనీలో 633 మందికి పట్టాలు
నెల్లూరు (Nellore) జిల్లా భగత్ సింగ్ కాలనీలో 633 మంది అర్హులైన వారికి పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు (Chandrababu Naidu) వర్చువల్ ద్వారా ప్రారంభించారు. స్థానిక మంత్రి నారాయణ విజ్ఞప్తిపై ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ:
“రాఖీ పండుగ రోజు మా ఆడబిడ్డలకు ఇల్లు ఇచ్చే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది వారికి భద్రత కలిగించడమే కాక, భవిష్యత్‌కు బలమైన ఆధారం కూడా.”
సూపర్ సిక్స్, ఇతర సంక్షేమ పథకాలు విజయం
పేదల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ సహా ఇతర సంక్షేమ పథకాలు విశేష విజయాన్ని సాధించాయని సీఎం తెలిపారు. ఉచిత గ్యాస్ పంపిణీ, పింఛన్లు, “తల్లికి వందనం”, అన్నదాత సుఖీభవ, అన్నా క్యాంటీన్లు వంటి పథకాలతో పేదల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయని అన్నారు.
ఆడబిడ్డల కోసం ఉచిత బస్సు ప్రయాణం
ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించడం ద్వారా మహిళలకు మరింత మేలు జరుగుతోందని చంద్రబాబు వెల్లడించారు. మహిళల ఆర్థిక భద్రతకు ఇది ముఖ్యమైన అడుగు అని అభిప్రాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: