తెలుగువారి ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా అమరావతిలో ఎన్టీఆర్ స్మృతివనం (NTR Memorial)ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, భాష, సాహిత్యం, కళలు, చరిత్ర వంటి అంశాల ప్రతిబింబం కనిపించనుంది.
182 మీటర్ల ఎన్టీఆర్ విగ్రహం – విశిష్ట ఆకర్షణగా
ఈ ప్రాజెక్టులో ముఖ్య ఆకర్షణగా 182 మీటర్ల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించనున్నారు. ఇది భారతదేశంలోనే , ప్రపంచంలోనూ ఎంతో ప్రాధాన్యత పొందే విగ్రహంగా నిలవనుంది. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీను ఆదర్శంగా తీసుకొని, అంతకంటే మెరుగైన స్థాయిలో ఇది అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు.

తెలుగు యోధుల విగ్రహాలు – స్ఫూర్తిదాయక శిల్పకళ
ప్రాజెక్టులో భాగంగా అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju), పొట్టి శ్రీరాములు వంటి మహానుభావుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి స్ఫూర్తిదాయక జీవితం గురించి సందర్శకులకు వివరించేలా సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
తెలుగు సంస్కృతి – సమగ్ర ప్రదర్శన
ఈ స్మృతివనంలో తెలుగు భాష, లిపి, సంప్రదాయాలు, సంగీతం, నృత్యం, జానపద కళలు వంటి ఎన్నో అంశాలను సాంకేతికంగా ప్రజెంట్ చేయనున్నారు. ప్రజలు తెలుగువారి గొప్పతనాన్ని అనుభవించేలా ఇంటరాక్టివ్ డిస్‌ప్లేలు, విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లు ఉంటాయి.
పర్యాటక ఆకర్షణగా మారే నీరుకొండ రిజర్వాయర్
స్మృతివన ప్రాంగణంలోని నీరుకొండ రిజర్వాయర్‌ను పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పడవ ప్రయాణాలు, లేజర్ షోలు, ఫుడ్ కోర్టులు, మ్యూజియంలు వంటి అంశాలు పర్యాటకులను ఆకర్షించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో కన్వెన్షన్ సెంటర్
ప్రాజెక్టులో భాగంగా ప్రపంచ స్థాయి కన్వెన్షన్ సెంటర్ను నిర్మించాలన్నది మరో ముఖ్యమైన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా జరిగే సమావేశాలకు ఇది వేదికగా మారేలా ప్లానింగ్ చేస్తున్నట్లు సమాచారం.
కృష్ణానదిపై ఐకానిక్ వంతెన డిజైన్లు పరిశీలనలో
అమరావతిని అనుసంధానించే కృష్ణా నదిపై ప్రత్యేకమైన వంతెన నిర్మాణానికి డిజైన్లను కూడా సీఎం పరిశీలించారు. ఇది నగర శోభను పెంచడంతోపాటు, అభివృద్ధికి మార్గదర్శకంగా నిలవనుంది.
Read hindi News: Hindi.vaartha.com
Read also: