కుప్పం: రాష్ట్ర ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు తన సొంత నియోజకవర్గ కేంద్రం అయిన కుప్పం మున్సి పాలిటీని దేశంలోనే ఓ మోడల్ మున్సిపాలిటీగా (Chandrababu Naidu) మార్చుతామని ఇదివరకే ప్రకటించిన విషయం విదితమే. ఈనేపథ్యంలో కుప్పం పట్టణాన్ని ఓ సుందర పట్టణంగా మార్చే దిశగా అడుగులు పడుతున్నాయి. కుప్పం మున్సిపాలిటీ రూపురేఖలు మార్చేందుకు సింగపూర్ దేశంకు చెందిన ప్రముఖ సంస్థ ‘సుర్బానా జురాంగ్'(Surbana Jurong) ముందుకు వచ్చింది. ఈ సంస్థ మున్సిపాలిటీ అభివృద్ధికి తగు మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఇటీవలే సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధుల బృందం కుప్పంలో ప్రభుత్వ విప్ కంచర్ల శ్రీకాంత్, కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ తో కలసి పట్టణాన్ని పరిశీలించింది. సుర్బానా సంస్థ నగరాలు, పట్టణాల్లో ప్రజలకు అనుగుణంగా వారు నివశించే ప్రాంతాలను పర్యావరణ సంహితంగా కార్యాచరణ రూపొందిస్తుంది. ఈ సంస్థ సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, హాంకాంగ్, యుకె, యుఎస్ఎ, ఆఫ్రికా, మధ్య ప్రాచ్య దేశాల్లో వివిధ నగరాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడంతో పాటు ఫ్యూచర్ సిటీల నిర్మాణంలో భాగస్వామ్యం వహించింది. నియోజకవర్గ కేంద్రమైన కుప్పం పట్టణ అభివృద్ధికి సుర్బానా సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించనుంది.
Read also: భారీగా పెరగనున్న ఎరువుల ధరలు!

భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల ప్రణాళిక
పట్టణ సుందరీకరణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్లు, పట్టణంలో 12 సర్కిళ్ల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించనున్నారు. వీటితో పాటు పట్టణంలో మాల్ స్ట్రీట్ ఏర్పాటుకు కూడా ఈ ప్లాన్లో చర్యలు పట్టణ సుందరీకరణ, రోడ్లు, మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ ఇప్పటికే రూ.92 కోట్ల నిధులు మంజూరు చేపట్టనున్నట్లు సమాచారం. పట్టణ జనాభా సుమారు 40-45వేలు ఉండగా భవిష్యత్తులో జనాభా పెరుగుదల, ఇతర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణాన్ని ఓ సమగ్ర ప్లాన్తో అభివృద్ధి చేసేలా ఈసంస్థ డిజైన్ చేయనుంది. తద్వారా కుప్పం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో కీలకం కానుంది. కుప్పం మున్సిపాలిటీ అభివృద్ధికి సిఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) దాదాపు 92.20 కోట్ల రూపాయల నిధులు ఇదివరకే మంజూరు చేశారు. ఈనిధులతో సుమారు రూ.22 కోట్లతో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్, రూ.3 కోట్లతో ఎల్పిజి బర్నింగ్ యూనిట్ పనులు మొదలయ్యాయి. త్వరలోనే పట్టణంలోని సెంట్రల్ పార్క్ రూ.10 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే డికెపల్లి పార్క్, రోడ్ల అభివృద్ధి, పట్టణ సుందరీకరణ, ఇతర అభివృద్ధి పనులు మొదలుకానున్నాయి. కుప్పంలో రూ.70 కోట్లతో అత్యాధునిక బసెస్టేషన్ నిర్మాణం సైతం అతి త్వరలో జరగనుంది. మున్ముందు సిఎం చొరవతో ఓ కొత్త కుప్పాన్ని చూస్తామనడం అతిశయోక్తి కాదు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: