విజయవాడ : దీర్ఘ, మధ్య, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు (chandrababu naidu) అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని సీఎం చంద్రబాబునాయుడు అన్ని ప్రభుత్వరంగ కీలకశాఖలకు ఆదేశాలను జారీ చేసారు. ప్రభుత్వ పనితీరు అత్యంత ప్రయోజనాత్మకంగా ఉందనే సంతృప్తి ప్రజలకు కలగచేయాలన్నారు. సీఎంవో కార్యాలయం ద్వారా ఈ సమాచారం వెల్ల నెలవారీ, త్రైమాసికాల వారీగా లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలి. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉంది. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం.
Read also: AP: రైలులో అగ్నిప్రమాదం.. అధికారులతో మాట్లాడిన మంత్రి అనిత

Chandrababu Naidu
ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి
ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే అధికారులు, ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత కావాలి. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్గా మార్చుకుని సమర్థవంతంగా ఆ విభాగాన్ని వినియోగించుకోవాలి. ఇటీవల వచ్చిన తుఫాన్ సమయంలో టెక్నాలజీ వినియోగించుకుని అంతా కలిసి కట్టుగా పని చేశాం. రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగాం. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారింది.
గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వన్ విజన్వన్ డైరెక్షన్ ఇదే ప్రభుత్వ విధానమని.. దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు…? డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చనే అంశాలపై సీఎం చంద్రబాబు అధికారులకు పలు సూచనలు చంద్రబాబు చేసారు. ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోంది. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: