chandrababu naidu : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నాలుగు రోజుల పాటు సాగిన పర్యటనను విజయవంతంగా ముగించుకున్న చంద్రబాబు నాయుడు స్వదేశానికి బయల్దేరారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సీఎం, శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా అమరావతికి వెళ్లనున్నారు. ఉదయం నుంచే సచివాలయంలో అధికారిక విధుల్లో పాల్గొననున్నట్లు సమాచారం.
దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత (chandrababu naidu) ప్రయోజనకరంగా మారిందని సీఎం తెలిపారు. కేవలం మూడు నుంచి నాలుగు రోజుల సమావేశాల ద్వారానే గ్రీన్ ఎనర్జీ, ఏఐ, వ్యవసాయం, టూరిజం రంగాల్లో సుమారు రూ.2.50 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా అవగాహనలు కుదిరాయని వెల్లడించారు. ప్రపంచ దిగ్గజ సంస్థలు భారత్, ముఖ్యంగా ఏపీ వైపు ఆసక్తిగా చూస్తుండటం శుభపరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.
Read Also: Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
ఈ పర్యటనలో చంద్రబాబు 36కిపైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూగుల్, ఐబీఎం, ఆర్సెలర్ మిట్టల్ వంటి ప్రముఖ సంస్థల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్ర పెట్టుబడి అవకాశాలను వివరించారు. అలాగే యూరప్‌లోని తెలుగు ప్రజలతో భేటీ అయ్యి, ‘బ్రాండ్ ఆంధ్రప్రదేశ్’ను ప్రపంచానికి మరింత చేరువ చేశామని సీఎం తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: