Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆవిష్కరించనున్న “అన్నదాత సుఖీభవ” పథకం ద్వారా రైతుల సంక్షేమానికి గట్టి బాట వేసేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ కార్యక్రమాన్ని శనివారం ఉదయం ప్రకాశం జిల్లా దర్శి (Darshi) మండలంలోని తూర్పు వీరాయపాలెం గ్రామంలో ఘనంగా ప్రారంభించనున్నారు.

సీఎం ప్రయాణ షెడ్యూల్ – వరుస కార్యక్రమాలకు సమయం కేటాయింపు
చంద్రబాబు (Chandrababu Naidu) శనివారం ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో ఉదయం 10 గంటలకు బయలుదేరి, 10:35కి దర్శి రెవెన్యూ విలేజ్ హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సీఎంను ఆహ్వానిస్తారు. అనంతరం 10:45కి రోడ్డు మార్గంలో తూర్పు వీరాయపాలెం గ్రామానికి వెళ్లి, 10:50 గంటలకు అన్నదాత సుఖీభవ కార్యక్రమ వేదిక వద్ద చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్నం 1:45 వరకు కొనసాగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 1.50 గంటలకు రోడ్డు మార్గంలో కాడ్రే సమావేశానికి బయలుదేరుతారు.
అక్కడ ఒక గంట పాటు సమావేశంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.50 గంటలకు తిరిగి దర్శి హెలిప్యాడ్‌కు బయలుదేరుతారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి, 3.35కు ఉండవల్లి చేరుకుంటారు.
రైతులతో ముఖాముఖి – నేరుగా సమస్యలపై చర్చ
ఈ పథకం ప్రారంభోత్సవానికి ముఖ్యాంశం రైతులతో సీఎం చంద్రబాబు నిర్వహించే ముఖాముఖి సమావేశం. ఇందులో ఆయన రైతుల సమస్యలను నేరుగా విన్నారు, వారికి ప్రభుత్వ మద్దతు, భవిష్యత్తు చర్యలపై దృఢమైన హామీలు ఇవ్వనున్నారు. రైతులతో ముఖాముఖి అనంతరం చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులు పాల్గొంటారు. పార్టీ బలోపేతానికి, కొత్త పథకాల అమలు పై కార్యాచరణ గురించి చర్చించే అవకాశముంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: