ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఈ నెల 26న సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటన జూలై 30వ తేదీ వరకు కొనసాగనుంది. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన పెట్టుబడులను ఆకర్షించడం, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్, టీజీ భరత్, నారాయణలు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనలో భాగం కానున్నారు.
ప్రముఖ కంపెనీలతో సమావేశాలు – పెట్టుబడులపై చర్చలు
ఈ పర్యటనలో చంద్రబాబు బృందం సింగపూర్ (Singapur) ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ వ్యాపార సంస్థల డెలిగేట్లతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను తెలియజేయనున్నారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు వంటి రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు చురుకుగా ప్రయత్నించనున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం, అభివృద్ధి విధానాల మార్పిడి లక్ష్యం
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికంగా పునరుద్ధరణలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చంద్రబాబు విదేశీ పర్యటనలను కార్యాచరణగా మలచుకున్నారు. గతంలో విదేశీ పర్యటనల ద్వారా పెట్టుబడులు సాధించిన అనుభవం ఈసారి కూడా ఉపయోగపడనుందని భావిస్తున్నారు. సింగపూర్ పర్యటన ద్వారా ఆ దేశంతో సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు, అక్కడి అభివృద్ధి మోడళ్లను కూడా రాష్ట్రంలో అమలు చేసే అవకాశాలున్నాయి. ఇది రాష్ట్రానికి ఆర్థిక ప్రగతితో పాటు, సాంకేతిక మార్గదర్శకత్వాన్ని కూడా కల్పించనుంది.
Read Also : Amaravathi : MLA, MLCల టవర్స్ లలో వసతుల కల్పనకు నిధులు