Chandrababu: విజయవాడలోని బెజవాడ దుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు(Chief Minister Chandrababu) నాయుడు తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఈఓ వి.కె. శీనా నాయక్, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్, ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్, వేదపండితులు హాజరయ్యారు. ముఖ్యమంత్రికి వేదపండితులు వేదాశీర్వచనాలు అందించగా, కమిషనర్, ఈఓలు ప్రసాదాలు, శేషవస్త్రం, మెమొంటోలను అందజేశారు. మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించాలని వారు ముఖ్యమంత్రిని కోరారు.

భక్తుల కోసం వైద్య సేవలు
దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు వైద్య సేవలు అందించడానికి ఇద్దరు వైద్యులను కేటాయిస్తూ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ ఈఓ వి.కె. శీనా నాయక్ వైద్యారోగ్య శాఖకు రాసిన లేఖ మేరకు డాక్టర్ సురేష్ బాబు, డాక్టర్ ఉదయకృష్ణలను డిప్యుటేషన్‌పై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి కేటాయించారు. ఘాట్‌రోడ్డుపై, కనకదుర్గానగర్ వైపు అంబులెన్స్‌లను కూడా సిద్ధం చేసినట్లు ఈఓ తెలిపారు. కాగా, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి. కృష్ణమోహన్(Justice B. Krishnamohan) తన కుటుంబంతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రసాదాలు, శేషవస్త్రం, మెమొంటోలను అందజేసి వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు.
దుర్గమ్మ దసరా ఉత్సవాల ఆహ్వాన పత్రికను ఎవరు ఆవిష్కరించారు?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయంలో ఈ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు.
దసరా ఉత్సవాలకు వైద్య సేవలు అందించడానికి ఎంతమంది వైద్యులను కేటాయించారు?
భక్తుల కోసం ఇద్దరు ఎంబీబీఎస్ వైద్యులను కేటాయించారు.
Read hindi news:hindi.vaartha.com
Read also