Chandrababu: మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రంలో తీవ్ర నష్టం చోటుచేసుకుంది. పలు జిల్లాల్లో ఇళ్లు మునిగిపోయి, పంట పొలాలు నీటమునిగాయి. రహదారులు, రైల్వే మార్గాలు కూడా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N.Chandrababu Naidu) బుధవారం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేశారు. అనంతరం స్వయంగా గ్రామాలకు వెళ్లి రైతుల పరిస్థితిని తెలుసుకున్నారు. పంటలు, ఆస్తుల నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి, బాధితులను ఓదార్చారు.
Read also: RTO Challan: ఆ వాట్సాప్ మెసేజ్‌తో జాగ్రత్త.. ఒక్క క్లిక్‌తో ఫోన్ హ్యాక్!

Chandrababu: పంట, ఆస్తి నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష
Chandrababu: గురువారం సీఎం చంద్రబాబు తుఫాన్ ప్రభావం, పంట మరియు ఆస్తి నష్టం పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమిక అంచనాలు వేసిందని ఆయన వెల్లడించారు. వరి, పత్తి, మొక్కజొన్న, అరటి మరియు ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఐదు రోజులలోగా పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులను పరామర్శించారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: