
కరోనా వంటి కఠిన పరిస్థితుల్లోనూ రైతులు వెనకడుగు వేయకుండా పొలాల్లో పనిచేసి రాష్ట్ర ప్రజలకు ఆహార భద్రత కల్పించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandra Babu) అన్నారు. శుక్రవారం రాయవరం లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రైతుల త్యాగం వల్లే రాష్ట్రం సంక్షోభాన్ని అధిగమించగలిగిందని పేర్కొన్నారు.
Read Also: Nellore: హెచ్ఐవి బాధితులకు మెరుగైన వైద్య సేవలు అవసరం

గత ప్రభుత్వ పాలనలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్‌కు ప్రమాదకరంగా మారాయని విమర్శించారు. రైతుల భూమి హక్కులను కాపాడేందుకే తాము ఎన్నికల ప్రచారంలో ‘మీ భూమి–మీ హక్కు’ అనే స్పష్టమైన హామీ ఇచ్చామని చెప్పారు.
భూముల రికార్డులను సరిదిద్ది, అధికారిక రాజముద్రతో పాసు పుస్తకాలు అందిస్తామని ఇచ్చిన మాటను ఇప్పుడు అమలు చేస్తున్నామని సీఎం(Chandra Babu) తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు నిర్వహించి ఈ నెల 11వ తేదీ వరకు రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా రైతులకు భూమిపై సంపూర్ణ హక్కులు లభిస్తాయని, బ్యాంకు రుణాలు మరియు ప్రభుత్వ పథకాలు సులభంగా అందుబాటులోకి వస్తాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: